Site icon NTV Telugu

AP Crime: ప్రాణం తీసిన స్వలింగ సంపర్కం..! బయట పడుతుందనే భయంతో వ్యక్తి దారుణ హత్య

Crime

Crime

AP Crime: ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య వివాదం కాస్తా.. ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది.. స్వలింగ సంపర్కానికి ఒప్పుకోకపోవడంతో పాటు.. నీ వ్యవహారం బయటపెడతానని వార్నింగ్‌ ఇవ్వడమే దీనికి కారణంగా తెలుస్తోంది.. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది.. మర్రిపూడి కొండ వద్ద మండల విద్యాశాఖలో పనిచేస్తున్న కొల్ల రాజశేఖర్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు.. ఈ ఘటనలో కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.

Read Also: Physical Harassment Case: క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు.. కోచ్‌ అరెస్ట్, 14 రోజుల రిమాండ్

ఈ హత్య కేసులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు డీఎస్పీ.. ప్రకృతికి విరుద్ధంగా మృతుడు, నిందితుడికి మధ్య స్వలింగ సంపర్క సంబంధం ఉందని.. మృతుడు కొల్ల రాజశేఖర్, నిందితుడు జగన్నాథం జయసింహకు ఇరువురు మధ్య గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఈ బంధం కొనసాగిందన్నారు.. తరుచు ఇద్దరు కలుసుకునేవారు.. అయితే, మృతుడు ఇటీవల పొదిలిలో ఒక వేడుకకు వెల్లగా అక్కడికి వెళ్లిన నిందితుడు జగన్నాథం.. స్వలింగ సంపర్కానికి ఒత్తిడి తెచ్చాడు.. రాజశేఖర్‌ అంగీకరించపోవడంతో.. జగన్నాథం మరింత బలవంతం చేశాడు.. ఒప్పుకోక పోగా.. నీ గే లక్షణాల గురించి నలుగురికి చెబుతానని.. దాంతో, నీకు ఇక పెళ్లి కూడా కాదని హెచ్చరించాడు.. దీంతో జగన్నాథానికి పంటలేని కోపం వచ్చింది.. అయితే, అది బయటకు ప్రదర్శించకుండా.. చివరిసారిగా నాతో ఒక్కసారి కలవాలని.. ఇకపై నిన్ను ఎప్పుడు అడగనంటూ ఈ నెల 18వ తేదీన మర్రిపూడి కొండ వద్ద రావాలని విజ్ఞప్తి చేశాడు.. అయితే, అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని.. దీంతో, నిందితుడు.. మృతుడిని కారుతో గుద్దించి పదేపదే కారుతో తొక్కించడంతో మృతుని మర్మంగాలు తెగిపోయినట్టు కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ వెల్లడించారు.. ఇక, ఈ కేసులో నిందితుడి ప్రియురాలు కూడా ఉంది.. ఈ హత్యకు ప్రియురాలి సహకారం కూడా ఉండటంతో ఇరువురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు..

Exit mobile version