Site icon NTV Telugu

మామ నీ కూతురు నా కళ్లముందే వేరొకడితో.. అందుకే అలా చేశా

husband kills wife

husband kills wife

అనంతపురంలో దారుణం చోటుచేసుకొంది. భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోందని భర్త మెనూ రోకలి బండతో తలపై మోది హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. కదిరి మండల పరిధిలోని పట్నం గ్రామంలో శివశంకర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి కొన్నేళ్ల క్రితం గుడిపల్లి గ్రామానికి చెందిన గోపాలప్ప కుమార్తె హేమలతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొన్ని నెలల క్రితం నుంచి భార్య హేమలత, రామాంజనేయులు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొంది. భర్త ఇంట్లో లేని సమయంలో అతడితో శృంగారంలో పాల్గొంటూ ఉండేది. ఆ నోటా ఈ నోటా ఆ విషయం భర్తకు తెలిసింది.

తన కూతురు వేరొక వ్యక్తితో అఫైర్ నడిపిస్తుందని శివశంకర్ మామ గోపాలప్పకు పలుమార్లు చెప్పినా అతను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే గురువారం వీరిద్దరి బాగోతం శివశంకర్ కంట పడింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త, భార్య తలపై రోకలిబండతో కొట్టి హతమార్చాడు. ఆ తరువాత అదే విషయాన్ని మామకు ఫోన్ చేసి నీ కూతుర్ని చంపేశా.. వెళ్లి చూసుకో అని చెప్పి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version