ఏపీలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడ గంజాయి సమాచారం వచ్చిన దాడులు చేస్తూ నిందితులును అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం యరజర్ల కొండల్లో ఎస్‌ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. కీలక సమాచారంతో ఎస్‌ఈబీ అధికారులు దాడులు నిర్వహించగా 50 లక్షల విలువైన 850 కేజీల గంజాయి అధికారులు పట్టుకున్నారు.
గంజాయిని ప్యాకింగ్ చేసి తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. నగరానికి కూతవేటు దూరంలో భారీగా గంజాయి పట్టుబడడంతో అధికారులు విస్మయానికి లోనైయ్యారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని అక్కడే ఎస్ఈబీ అధికారులు తగలబెట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
