NTV Telugu Site icon

Hyderabad Crime: పెళ్లి పేరుతో నన్ను వాడుకున్నాడు.. యువకుడి ఇంటి ముందు బాధితురాలు ధర్నా..

Hyderabad Crime

Hyderabad Crime

Hyderabad Crime: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి మోసం చేశాడని వనస్థలిపురం పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నందు కుమార్ అనే వ్యక్తి ఎస్బిఐలో బిల్డ్ వర్క్ గా పని చేస్తున్నాడు. గత ఆరునెలల క్రితం నందుకుమార్‌ అనే వ్యక్తి బాధితురాలి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లాడు. అక్కడ అంతా బాగానే కుదిరింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్ట పడ్డారు. పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యారు. ఈనేపథ్యంలోనే బాధితురాలి నుంచి నందుకుమార్‌ తన ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడు. ఇద్దరూ బాగానే మాట్లాడుకునేవారు. బయట కూడా కలుసుకునేవారు. ఇలానే ఆరునెలలు గడిచాయి. బాధితురాలు నందకుమార్‌కు పెళ్లి చేసుకోవాలని అడగడంతో కథ మొదలైంది. ఇంతలోనే నందుకుమార్‌ ప్లేట్‌ ఫిరాయించాడు. పెళ్లి చేసుకోలేను అంటూ మొహం చాటేశాడు. దీంతో బాధితురాలు
వనస్తలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆరు నెలలు తనని వాడుకున్నాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ వాపోయింది.

న్యాయం చేయాలని నందుకుమార్‌ ఇంటి వద్దకు వెళ్ళి నిలదీసింది. అయినా నందుకుమార్‌ పెళ్లికి నిరాకరించడంతో ఇంటి ముందు బాధితురాలు, కుటుంబసభ్యులు కూర్చొని ధర్నా చేపట్టింది. నందుకుమార్‌ తనని పెళ్లి చేసుకోవాలని భీష్మించుకుని కూర్చొంది. గత ఆరు నెలలుగా అన్ని రకాలుగా తనను వాడుకొని.. ఇప్పుడు పెళ్లి చేసుకోనని నందుకుమార్ చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తనని పెళ్లి చేసుకుంటానని రాతపూర్వకంగా కాగితంపై రాసికూడా ఇచ్చాడని .. ఆ పేపర్‌ ను సైతం బాధితురాలు చూపిస్తూ కన్నీరుమున్నీరుగా విలపించింది. తనకు న్యాయం జరిగేంతవరకు నందు కుమార్‌ ఇంటి వద్ద నుంచి కదిలే ప్రశక్తే లేదని చెప్పింది. ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందడంతో బాధితురాలి వద్దకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నందు కుమార్‌ ఇంటి ముందు బాధితురాలు ఆందోళన చేపట్టనా.. నందుకుమార్‌, తన కుటుంబ సభ్యులు స్పందించకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. బాధితురాలికి న్యాయం చేస్తామని నందు కుమార్ ను అదుపులో తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
20 Weds 70: 70 ఏళ్ల వృద్ధుడిని ప్రేమ పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల అమ్మాయి..(వీడియో)