Hyderabad Crime: పెళ్లి పేరుతో నన్ను వాడుకున్నాడు.. యువకుడి ఇంటి ముందు బాధితురాలు ధర్నా..
- పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన నందుకుమార్..
- నందుకుమార్ ఇంటిముందు కూర్చుని బాధితులు ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి మోసం చేశాడని వనస్థలిపురం పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నందు కుమార్ అనే వ్యక్తి ఎస్బిఐలో బిల్డ్ వర్క్ గా పని చేస్తున్నాడు. గత ఆరునెలల క్రితం నందుకుమార్ అనే వ్యక్తి బాధితురాలి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లాడు. అక్కడ అంతా బాగానే కుదిరింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్ట పడ్డారు. పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యారు. ఈనేపథ్యంలోనే బాధితురాలి నుంచి నందుకుమార్ తన ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇద్దరూ బాగానే మాట్లాడుకునేవారు. బయట కూడా కలుసుకునేవారు. ఇలానే ఆరునెలలు గడిచాయి. బాధితురాలు నందకుమార్‌కు పెళ్లి చేసుకోవాలని అడగడంతో కథ మొదలైంది. ఇంతలోనే నందుకుమార్ ప్లేట్ ఫిరాయించాడు. పెళ్లి చేసుకోలేను అంటూ మొహం చాటేశాడు. దీంతో బాధితురాలు
వనస్తలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆరు నెలలు తనని వాడుకున్నాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ వాపోయింది.
న్యాయం చేయాలని నందుకుమార్ ఇంటి వద్దకు వెళ్ళి నిలదీసింది. అయినా నందుకుమార్ పెళ్లికి నిరాకరించడంతో ఇంటి ముందు బాధితురాలు, కుటుంబసభ్యులు కూర్చొని ధర్నా చేపట్టింది. నందుకుమార్ తనని పెళ్లి చేసుకోవాలని భీష్మించుకుని కూర్చొంది. గత ఆరు నెలలుగా అన్ని రకాలుగా తనను వాడుకొని.. ఇప్పుడు పెళ్లి చేసుకోనని నందుకుమార్ చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తనని పెళ్లి చేసుకుంటానని రాతపూర్వకంగా కాగితంపై రాసికూడా ఇచ్చాడని .. ఆ పేపర్ ను సైతం బాధితురాలు చూపిస్తూ కన్నీరుమున్నీరుగా విలపించింది. తనకు న్యాయం జరిగేంతవరకు నందు కుమార్ ఇంటి వద్ద నుంచి కదిలే ప్రశక్తే లేదని చెప్పింది. ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందడంతో బాధితురాలి వద్దకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నందు కుమార్ ఇంటి ముందు బాధితురాలు ఆందోళన చేపట్టనా.. నందుకుమార్, తన కుటుంబ సభ్యులు స్పందించకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. బాధితురాలికి న్యాయం చేస్తామని నందు కుమార్ ను అదుపులో తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
20 Weds 70: 70 ఏళ్ల వృద్ధుడిని ప్రేమ పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల అమ్మాయి..(వీడియో)
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు