Instagram Love: ఇన్‌స్టాగ్రామ్‌ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!

  • ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో హర్యానా మహిళకు ప్రేమ, పెళ్లి.
  • “జానీ”గా పరిచయం చేసుకుని తనను హిందువుగా నటిస్తూ పెళ్లి చేసుకున్న వ్యక్తి.
  • అప్పటికే సదరు వ్యక్తికి పెళ్లై, ముగ్గురు పిల్లలు ఉన్నట్లుగా మహిళ ఆరోపణ.
  • అసలు పేరు జావెద్ ఖాన్ అని, చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.
Crime

Crime

Instagram Love: హిందువునని నటిస్తూ ఒక మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్న ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచమైన వ్యక్తి తనను తాను హిందువుగా పరిచయం చేసుకుని, తన అసలు గుర్తింపును దాచిపెట్టి హిందూ సంప్రదాయం ప్రకారం మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు ముస్లిం వ్యక్తి అని తెలుసుకుని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఘటన హర్యానాలోని సోనిపట్‌లో జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి తన పేరు జాని అని చెప్పుకున్నాడు. తాను హిందువు అని మహిళలో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు భార్యభర్తలుగా కలిసి జీవించడం మొదలుపెట్టారు. అయితే, పెళ్లైన ఆరు నెలల తర్వాత భర్త అసలు గుర్తింపుపై అనుమానం పెంచుకున్న మహిళ, తన భర్య బ్యాగ్ నుంచి ఆధార్ కార్డ్ పరిశీలించగా ‘‘జావెద్ ఖాన్’’ అసలు పేరు అని తెలిసింది. అతను ముస్లిం అని, అంతకుముందే వివాహమైనట్లు తెలుసుకుని షాకైంది.

జావెద్‌కు 12 ఏళ్ల క్రితమే వివాహం జరిగిందని, మొదటి భార్యతో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని మహిళ ఆరోపించింది. కొంతకాలం తర్వాత మొదటి భార్య తమ ఇంటికి వచ్చి జావెద్‌ను తనతో తీసుకెళ్లిందని బాధిత మహిళ ఆరోపించింది. ఆ తర్వాత జావెద్ మళ్లీ తిరిగి వచ్చాడని, తనతో కలిసి జీవించినట్లు చెప్పింది. యూపీలోని బుధానాలో కలిసి ఉన్న సమయంలో తమకు ఒక బిడ్డ జన్మించిందని ఆమె చెప్పింది. ఆ తర్వాత హర్యానా సోనిపట్‌కు వచ్చి ఇక్కడే కలిసి ఉన్నామని తెలిపింది.

అయితే, తన భర్త వారం నుంచి కనిపించకుండా పోయాడని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసుల్ని ఆశ్రయించింది. తనను, తన పిల్లల్ని మతం మారాలని ఒత్తిడి తెస్తున్నాడని ఆరోపించింది. తన భర్త, అతడి కుటుంబం అసలు గుర్తింపు దాచి తనను మోసం చేశారని, వేధిస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించింది. ఈ విషయంపై పోలీసులు ఇరు పక్షాలతో మాట్లాడుతున్నారు. మహిళ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించారు.