Haryana: భార్య చేతిలో మరో భర్త బలి.. యూట్యూబర్ సాయంతో..!
- హర్యానాలో మరో ఘోరం
- యూట్యూబర్ సాయంతో భర్తను చంపిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవాడినే కడతేరుస్తున్నారు. కలకాలం తోడుండాల్సిన వాళ్లే.. అర్థాంతరంగా కాటికి పంపిస్తున్నారు. ఆ మధ్య జరిగిన మీరట్ హత్యా ఘటన మరువక ముందే తాజాగా అలాంటి ఘటనే హర్యానాలో వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Punjab King-IPL: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. మొదటి జట్టుగా..!
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
రవీనా (32), ప్రవీణ్ (35) భార్యాభర్తలు. హర్యానాలోని హిసార్ జిల్లా ప్రేమ్‌నగర్‌లో ఉంటున్నారు. అయితే రవీనా.. సురేష్ అనే యూట్యూబర్‌తో కలిసి రీల్స్ చేస్తోంది. దీన్ని భర్త ప్రవీణ్ జీర్ణించుకోలేకపోయాడు. రీల్స్ చేయొద్దంటూ భర్తతో పాటు కుటుంబ సభ్యులు వారించారు. ఆమె ఏ మాత్రం లెక్కచేయలేదు. పెడచెవిన పడేసింది. రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో 34, 000 మంది ఫాలోవర్లు పెరిగారు. ఇలా ఏడాదిన్నరగా రీల్స్ చేస్తూ భర్తను ఏ మాత్రం పట్టించుకోకుండా యూట్యూబర్ సురేష్‌తోనే కలిసి తిరుగుతోంది.
ఇది కూడా చదవండి: Trump: వలసదారులకు ట్రంప్ ప్రత్యేక ఆఫర్
అయితే గత నెల మార్చి 25న రవీనా-యూట్యూబర్ సురేష్ ఒక గదిలో అభ్యంతరకర స్థితిలో భర్త ప్రవీణ్‌కు కనిపించారు. ఆ సీన్ చూసి ప్రవీణ్ తట్టుకోలేకపోయాడు. దీంతో రవీనాతో ప్రవీణ్ గొడవకు దిగాడు. అంతే రవీనా-సురేష్ కలిసి ప్రవీణ్ గొంతు కోసి చంపేశారు. అదే రాత్రి తెల్లవారుజామున 2:30 గంటలకు ప్రవీణ్ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి.. ఇంటికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్డు డ్రైయిన్‌లో పడేశారు. అయితే ప్రవీణ్ కుటుంబ సభ్యులు.. రవీనాను ఆరా తీయగా.. తనకు తెలియదని నటించింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మార్చి 28న ప్రవీణ్ మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో కనుగొన్నారు.
ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవీనా ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా బాగోతం బయటపడింది. బైక్‌పై ప్రవీణ్ మృతదేహాన్ని తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. తిరిగి అదే బైక్‌పై రెండు గంటల తర్వాత వచ్చినప్పుడు మాత్రం రవీనా-సురేష్ మాత్రమే బైక్‌పై ఉన్నట్లు కనిపించింది. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. నేరాన్ని అంగీకరించారు. రవీనా-సురేష్‌ను పోలీసులు జైలుకు పంపించారు. ప్రవీణ్‌కు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అతడు తాత సుభాష్, మామ సందీప్ దగ్గర నివాసం ఉంటున్నాడు.
ఇది కూడా చదవండి: Crime News: రౌడీ షీటర్ హత్య కేసులో ఎనిమిది మంది అరెస్ట్
Ravina Rao, a Youtuber met Suresh on Instagram
Their affair began & she started making videos with him
Ravina was married to Praveen and one day he caught them red handed
Ravina & Suresh strangled Praveen to Death & dumped his body in a Canal#HusbandMurder pic.twitter.com/LbbZFQFtaD
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 16, 2025
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు