Site icon NTV Telugu

Peeing on Road: అసలు వీడు మనిషేనా.. కారు డోర్ తీసి ఏంట్రా ఆ పని…

Untitled Design

Untitled Design

రోజు రోజుకు యువత నైతిక విలువలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. రోడ్లపై ఏం చేస్తున్నామన్నా కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తి కదులుతున్న కారు డోర్ ఓపెన్ చేసి రోడ్డుపై మూత్ర విసర్జన చేసుకుంటూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చేస్తుంది.

Read Also: Pressure cooker: ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ గురుగ్రామ్‌లో ఓ యువకుడి ప్రవర్తన చాలా అసభ్యకరంగా ఉంది. కారులో వెళ్తూ.. డోర్ తీసి మూత్ర విసర్జన చేశాడు. అతడు మూత్ర విసర్జన చేసిన వీడియో ఎవరో వెనక వీడియో తీసారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఒక వ్యక్తి కదులుతున్న థార్ తలుపు తెరిచి రోడ్డుపై మూత్ర విసర్జన చేస్తున్నట్లు కనిపించింది. పోలీసులు వాహన యజమానిని గుర్తించి.. SUV నడుపుతున్న మోహిత్ ఈ చర్యకు పాల్పడిన అనుజ్‌గా గుర్తించారు. వాహనం నంబర్ ట్రేస్ చేసి.. డ్రైవర్ మోహిత్, ఇలా రోడ్ల మీద యూరిన్ చేసిన అనూజ్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Read Also:Nagula Chavithi: నేడే నాగుల చవితి.. పుట్టలో పాలు పోయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..!

వీడియో చూసిన నెటిజన్లు మాత్రం వాళ్లు చేసిన పనికి తెగ మండిపడుతున్నారు. వీళ్లపై తెగ మండిపడుతున్నారు. వీళ్ల కొంచెం కూడా బుద్ధి ఉందా లేదా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొందరు మాత్రం ఇదో కొత్త రకం ట్రెండ్ కావచ్చు అంటూ.. ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి తెలివి తక్కువ పనులు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని కామెంట్స్ చేస్తున్నారు..

Exit mobile version