Guntur Murder Case: మద్యం మాన్పించాలని కొడితే ప్రాణమే పోయింది.. భార్య చేతిలో భర్త హత్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur murder case: వాళ్లిద్దరూ భార్యాభర్తలు… వారికి ఒక చిన్నారి సంతానం… కూలీపనులు చేసుకుంటూ హాయిగా జీవనం కొనసాగిస్తున్నారు… మద్యం వ్యసనం ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది… సరదా అలవాటు కాస్తా వ్యసనంగా మారింది… భర్తలో మార్పుకోసం భార్య చేసిన ప్రయత్నంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని చూసింది. కానీ పోలీసుల ప్రశ్నలతో అడ్డంగా బుక్కయింది. ఇంతకీ ఈ కేసులో అసలేం జరిగిందంటే..?
READ MORE: Karimnagar SI Suicide: ఎస్సై ఆత్మహత్యకు కారణం అదేనా?
Also Read
- Jaipur Murder: ప్రభుత్వ ఉద్యోగం కోసం తల్లిని మాత్రమే కాదు, తండ్రిని కూడా చంపింది.!
- Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
- CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
- Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
ఆరేళ్ల క్రితం గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంకు చెందిన తిరుపతమ్మతో వెంకటేశ్వర రావుకు పెళ్లయింది. కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలం క్రితం పొన్నూరు నుంచి దాసరిపాలెంకు మకాం మార్చారు. గతంలో వెంకటేశ్వరరావుకు మద్యం అలవాటు ఉండేది. అయితే ఏడాదికాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో పడి కూలీపనులకు కూడా వెళ్లడం మానేశాడు. మద్యం తాగేందుకు డబ్బులకోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు భరించలేని భార్య ఇదే విషయాన్ని బంధువులకు చెప్పింది. తన భర్తలో నయానో భయానో మార్పు తీసుకురావాలని బంధువులను కోరింది. తిరుపతమ్మ బంధువులు కొంత మంది 2 రోజులక్రితం ఇంటికి వచ్చారు. ఆ సమయంలో కూడా వెంకటేశ్వరరావు మద్యం మత్తులోనే ఉన్నాడు. పద్దతి మార్చుకోవాలని బంధువులు చెప్పినా పట్టించుకోలేదు. మద్యం అలవాటు మానేసి ఎప్పటిలా ఉండమని సూచించారు. అయితే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరరావు భార్య తరపు బంధువులతో వాగ్వాదానికి దిగాడు. నీ మంచికోసమే చెబుతున్నామని చెబుతున్నా ఎవరినీ లెక్క చెయ్యలేదు. దీంతో వెంకటేశ్వరరావులో మార్పు రావాలంటే మరింత కఠినంగా వ్యవహరించాలని భావించారు. అంతే అందరూ కలిసి వెంకటేశ్వరరావుకు దేహశుద్ది చేశారు. ప్రమాదవశాత్తు తగలరానిచోట దెబ్బలు తగలడంతో వెంకటేశ్వరరావు కుప్పకూలిపోయాడు. ఆందోళనకు గురైన భార్య,బంధువులు వెంకటేశ్వరరావుకు ఏమైందోనని కంగారుపడ్డారు. వెంకటేశ్వరరావు తాము కొట్టిన దెబ్బలకు చనిపోయినట్లు గుర్తించారు..
READ MORE: Dhurandhar 2: దురంధర్ నటుల్ని భలే పట్టారే.. రీల్ vs రియల్ పిక్స్ మీకోసం!
మంచి చేద్దామని వస్తే ఇలా జరిగిందేమిటా అని అందరూ తలలు పట్టుకున్నారు. ఎలాగైనా హత్య కేసునుంచి బయడపడాలని ఆలోచించారు. అందరూ కలిసి పక్కాగా ప్లాన్ వేశారు. వెంకటేశ్వరరావు మృతదేహాన్ని తీసుకుని ఈదురుపాలెం చెరువు వద్దకు వెళ్లారు. వెంకటేశ్వరరావు మృతదేహానికి పెద్ద బండరాయి కట్టి చెరువులో పడేశారు. మరుసటిరోజు చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మృతదేహానికి బండకట్టి ఉండడంతోపాటు మృతుడి శరీరంపై గాయాలుండడంతో హత్యచేసి చెరువులో పడేసి ఉంటారని భావించారు. మృతుడు ఎవరనేదానిపై విచారణ చేపట్టిన పోలీసులు.. తర్వాత మృతుడి భార్య తిరుపతమ్మను విచారించారు. మొదట్లో తనకేమీ తెలియదని చెప్పింది. అనుమానంతో తిరుపతమ్మను పోలీసులు తమదైన స్టైల్ లో విచారించడంతో హత్య వ్యవహారం బయటపడింది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు..
తాజావార్తలు
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్‌ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!