Site icon NTV Telugu

Groom killed: పెళ్లికి ఒక రోజు ముందు వరుడి దారుణహత్య.. వధువు “లవ్ ఎఫైర్” కారణం..

Up

Up

Groom killed: పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత భర్తల్ని చంపడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారింది. పలువురు మహిళలు తమ భర్తల్ని చంపుతున్న కేసులు ఇటీవల కాలంలో పెరిగింది. ఇటీవల మేఘాలయలో రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో భార్య సోమన్ రఘువంశీ దారుణంగా హత్య చేయించింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ రాంపూర్‌లో ఒక వరుడిని పెళ్లి ముందు రోజు హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జూన్ 15న జరిగింది. వరుడి గ్రామం ధన్‌పూరాకు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడిన నిందితుడికి, మృతుడికి కాబోయే భార్యతో సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read Also: Asim Munir: ‘‘నువ్వు ఒక పిరికిపంద, నీకు సిగ్గులేదు’’.. పాక్ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్ మునీర్‌కు ఘోర అవమానం..

రాంపూర్ పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు సద్దాంను సోమవారం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హత్యకు గురైన నిహాల్ మొబైల్ ఫోన్‌ని దాడిపెట్టినట్లు నిందితుడు పోలీసులకు చెప్పారు. నిహాల్ 15వ తేదీన హత్యకు గురయ్యాడు. హత్య తర్వాత, కొత్వాలి గంజ్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు నిహాల్ మొబైల్ స్వాధీనం చేసుకునే క్రమంలో, సద్దాం పోలీసుల వద్ద నుంచి పిస్టల్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో, ఆత్మరక్షణ కోసం పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు సద్దాం గాయపడ్డాడు.

వధువు గుల్ఫాషాగా గుర్తించారు. ఈమె, తన లవర్ సద్దాంతో కలిసి నిహాల్ హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు నిందితుడి స్నేహితుడు కూడా సాయం చేశాడు. ప్రస్తుతం, గుల్ఫాషా, మరో నిందితుడు పరారీలో ఉన్నారు. బాధితుడు నిహాల్ (35) వివాహాలు, పార్టీలకు వంటవాడిగా పనిచేస్తున్నాడు.

భోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనుపుర గ్రామానికి చెందిన గుల్ఫాషాతో అతని వివాహం నాలుగు నెలల క్రితం నిశ్చయించబడింది. జూన్ 15న వివాహం జరగాల్సి ఉంది, నిహాల్ ఇంట్లో సన్నాహాలు జరుగుతున్నాయి. జూన్ 14న వధువు బంధువుగా పరిచయం చేసుకున్న వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లు కుటుంబీకులు చెప్పారు. దీంతో నిహాల్ ఇద్దరితో కలిసి బయటకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు సద్దాం, అతడి అనుచరుడు ఫర్మాన్, అనీస్‌పై కేసు నమోదు చేశారు. గుల్ఫాషా 32 ఏళ్ల పొరుగువాడు సద్దాంతో ఒక సంవత్సరం పాటు ప్రేమలో ఉందని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version