ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం.. 65 మంది మహిళా టీచర్లకు ఆ వీడియో పంపి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్లోనే ఉంటున్నారు.. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ అంటూ వాటితోనే జీవితం గడుపుతున్నారు. అలాంటి మీడియా గ్రూపుల్లో ఎవరైనా ఏదైనా పోస్ట్ చేస్తున్నారంటే కొద్దిగా ఆలోచించాలి. ముందు వెనుక ఆలోచించకుండా ఏది పడితే అది పోస్ట్ చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా అలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఒక ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకం 65 మంది మహిళా టీచర్లకు కోపం తెప్పించింది.
వివరాల్లోకి వెళితే.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్‌లోని స్టేట్ ఎడ్యుకేషన్ సెంటర్ కీలక నిర్ణయం తీసుకొంది. అందులో భాగంగానే విద్యార్థుల తల్లిదండ్రులకు, టీచర్లకు కలిపి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఏ విషయమైన ఆ గ్రూప్ నుంచే డిస్కస్ చేయాలనీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ గ్రూప్ లోనే కృపాశంకర్ అనే ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు. అతను రెండు రోజులు క్రితం ఒక పాడుపని చేశాడు. అనుకోకుండా ఆ వాట్సాప్ గ్రూప్ లో ఒక అశ్లీల వీడియో లింక్ ని షేర్ చేశాడు. అందరు అదేదో ముఖ్యమైన లింక్ అనుకోని ఓపెన్ చేసి షాక్ అయ్యారు. అయితే ఆ లింక్ అశ్లీల వీడియో లింక్ అని తెలిసిన వెంటనే సదరు టీచర్ లింక్ డిలీట్ చేశాడు.అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ముఖ్యంగా ఆ గ్రూప్ లో ఉన్న 65 మంది మహిళా టీచర్లు ఆయన చేసిన పనికి ఖంగుతిన్నారు.అనంతరం పలువురు ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇక ఈ ఘటనపై కృపాశంకర్ స్పందిస్తూ పొరపాటున ఆ లింక్ షేర్ అయ్యిందని, కావాలని చేయలేదని, అందరు తనను క్షమించాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోనున్ట్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
ట్రెండింగ్
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?