Site icon NTV Telugu

గోల్డ్ స్మగ్లింగ్ లో రూటే సపరేటు.. కానీ..

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.1.36 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు శనివారం తెలిపారు. ప్రయాణికుడు శుక్రవారం దుబాయ్ నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. అతని వద్ద నుంచి రూ.1.36 కోట్ల విలువైన 2,715.800 గ్రాముల బంగారు వస్తువులను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారాలను ఏమార్చడానికి కేటుగాడు తన వెంట తెచ్చుకున్న వస్తువుల లోపల బంగారు గొలుసులు మరియు పేస్ట్ రూపంలో బంగారాన్ని దాచాడు.

జనవరి 11న దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళా ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు రూ.72.80 లక్షల విలువైన 1.48 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు వేర్వేరు కేసుల్లో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికులు లోదుస్తుల లోపల బంగారాన్ని దాచిపెట్టగా, మూడో వ్యక్తి పురీషనాళంలో దాచుకున్నాడు. జనవరి 10న దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.21.70 లక్షల విలువైన 442.6 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని ప్రత్యేకంగా కుట్టిన అండర్‌గార్మెంట్ జేబులో దాచారు.

Exit mobile version