Site icon NTV Telugu

Guntur Crime: వేధింపులతో బాలిక ఆత్మహత్య.. భయంతో యువకుడి ఆత్మహత్యాయత్నం..

Crime

Crime

Guntur Crime: బాలికలపై వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో దారుణం జరిగింది.. ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధింపులకు గురిచేశాడు ఓ యువకుడు.. అయితే ఈ వ్యవహారాన్ని తన తండ్రి దృష్టికి తీసుకెళ్లింది బాలిక.. దీంతో, యువకుడిని అడ్డుకునేందుకు మందలించాడు బాలిక తండ్రి.. ఇంకేముంది.. బాలిక తండ్రిపై దాడి చేశాడు నీలాంబరం అనే యువకుడి.. అంతేకాదు.. నిత్యం వేధింపులు ఎక్కువ కావడంతో.. ఆ వేధింపులు తట్టుకోలేక, తీవ్రమనస్థాపానికి గురైన బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.. ఇక, బాలిక మృతి చెందిన విషయం తెలిసి భయంతో వణికిపోయిన యువకుడు నీలాంబరం.. ఎలకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశాడు.. కానీ, ప్రాణాలతో బయటపడ్డాడు.. మరోవైపు.. నీలాంబరంతోపాటు బాలిక మరణానికి కారణమైన, మరికొంతమందిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు ఫిరంగిపురం పోలీసులు.. వేధింపులతో బాలిక ఆత్మహత్య.. బాలిక తండ్రిపై దాడి.. ఇతర పరిణామాలపై దర్యాప్తు చేపట్టారు ఫిరంగిపురం పోలీసులు..

Read Also: CM Revanth Reddy: నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమావేశం.. తొమ్మిది అంశాలపై చర్చ..

Exit mobile version