Site icon NTV Telugu

Crime News: శృంగారానికి ఒప్పుకోవట్లేదని ‘గే’ ఎటాక్.. ఆ తర్వాత ఏమైందంటే?

Gay Killed Boyfriend

Gay Killed Boyfriend

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఒక విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది. శృంగారం విషయంలో ఇద్దరు ‘గే’ల మధ్య నెలకొన్న గొడవ.. ఒకరి ప్రాణాల్ని బలి తీసుకుంది. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే.. ప్రదీప్ ఓ స్వలింగ సంపర్కుడు. ఇతనికి పురుషులతో సంబంధాలు పెట్టుకోవడం ఇష్టం. ఇతడు మహిళ వేషధారణలో తిరుగుతుండేవాడు. ఇతడు ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఒంటరిగా ఉంటూ.. ఓ షాపులో పని చేసేశాడు.

ఒకరోజు ప్రదీప్‌కి రక్షిత్ గౌడ అనే ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. ప్రదీప్‌ని మహిళ వేషధారణలో చూసి ముగ్ధుడైన రక్షిత్.. అతనికి దగ్గరయ్యాడు. కొన్నాళ్ల తర్వాత ప్రదీప్ పురుషుగే అని తెలిసినా.. అతనితో సంబంధం పెట్టుకోవడానికి రక్షిత్ అభ్యంతరం తెలపలేదు. అప్పట్నుంచి ఇద్దరు సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టారు. వీరి మధ్య లైంగిక సంబంధమూ ఉంది. ఎప్పట్లాగే మే 28వ తేదీన ప్రదీప్ ఇంటికి రక్షిత్ వెళ్లాడు. పీకల్లోతు మద్యం తాగి వచ్చిన రక్షిత్.. తన కామవాంఛ తీర్చాల్సిందిగా ప్రదీప్‌ని కోరాడు. అయితే, ప్రదీప్ అందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ ఏర్పడింది.

తమ కామవాంఛ తీర్చలేదని కోపంతో రగిలిపోయిన రక్షిత్.. అక్కడే ఉన్న కత్తి తీసుకొని ప్రదీప్‌పై దాడి చేశాడు. ఆ దాడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ప్రదీప్.. అతని చేతిలో ఉన్న కత్తి తీసుకొని పొడిచి, రక్షిత్‌ని హతమార్చాడు. అనంతరం ఇంటికి తాళం వేసి, అక్కడి నుంచి పారిపోయాడు. ఇంట్లో నుంచి కుళ్లిపోయిన వాసన రావడంతో, స్థానికులు పోలీసుల్ని ఆశ్రయించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంటనే నిందితుడ్ని అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

Exit mobile version