ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. విషయంలో జరిగిన చిన్న వివాదం కారణంగా 34 ఏళ్ల వ్యక్తిని తోటి గ్రామస్తులు కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… గంజాం జిల్లా ధరకోట్ పోలీసు స్టేషన్ పరిధిలోని రెడ్డి దామదార గ్రామంలో ఆదివారం రాత్రి డబ్బు విషయంలో జరిగిన చిన్న వివాదం కారణంగా 34 ఏళ్ల వ్యక్తిని తోటి గ్రామస్తులు కత్తితో పొడిచి చంపారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతుడిని రెడ్డి దామదర నివాసి డి. శంకర్ రెడ్డిగా గుర్తించారు. మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: Keonjhar:దారుణం.. కుటుంబ కలహాలతో.. సవతి తండ్రి హత్య
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు శంకర్ కి, తోటి గ్రామస్థులకు మధ్య డబ్బు విషయంలో గొడవ జరగడంతో.. అతడిపై కత్తితో దాడి చేశారు. పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో .. స్థానికులు అస్కా సబ్-డివిజనల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత, అతని పరిస్థితి మరింత విషమించడంతో బెర్హంపూర్‌లోని MKCG ఆసుపత్రికి తరలిస్తుండగా.. దారిలో మరణించాడు. దాడి వెనుక ఉన్న ఖచ్చితమైన కారణం ఇంకా అస్పష్టంగానే ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దాడికి గల కారణాలను తెలుసుకోవడానికి మరియు నిందితులను గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపారు.
Also Read:Tragedy: విగ్రహ నిమజ్జనంలో అపశృతి… 13 మంది యువకుల గల్లంతు.
“కొంతమందికి గతంలో డ్యాన్స్ షోలో కొంత డబ్బు విషయంలో అతనితో శత్రుత్వం ఉండేదని మృతుడి సోదరుడు సంజయ్ కుమార్ రెడ్డి వెల్లడించాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, నిందితులు తన సోదరుడిని పొడిచి చంపారు. కనీసం 4-5 మంది ఉన్నారని.. కానీ వారిలో ఒకరు అతనిని పొడిచి చంపారని సంజయ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
