Site icon NTV Telugu

Cyber ​​Crime: సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో 42 శాతం మంది.. ప్రతి 10 మందిలో నలుగురు బాధితులే..!

Cyber Crime

Cyber Crime

ఓ వైపు టెక్నాలజీ పెరుగుతోంది.. కొత్త కొత్త మోడల్స్‌లో స్మార్ట్‌ ఫోన్లు వచ్చేస్తున్నాయి.. అన్నింటికీ ఫోన్‌ నంబర్‌ లింక్‌.. ఇదే సమయంలో.. సైబర్‌ నేరగాళ్లు తమ పని ఈజీగా కానిస్తున్నారు.. గుట్టుచప్పుడు కాకుండా.. గుట్టుగా ఖాతాల్లో ఉన్నది మొత్తం లాగేస్తున్నారు.. రోజుకో కొత్త ఐడియా.. పూటకో ప్లాన్‌ అనే తరహాలో.. కొత్త తరహా మోసాలకు తెరలేపుతూ.. ప్రజలు తమ ఉచ్చులో పడేలా చేస్తున్నారు.. ప్రస్తుతం డిజిటల్‌ యుగం కావడం.. ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ పెరిగిన నేపథ్యంలో మోసాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. ఎంతో మంది సైబర్‌ మోసాల బారిన పడుతూ డబ్బులు కోల్పోతున్నారు. దేశ వ్యాప్తంగా గడిచిన మూడేళ్లలో తాము లేదా తమ కుటుంబంలో ఒకరు ఆర్థిక మోసానికి గురైనట్లు 42 శాతం తెలిపారంటనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రతినెల దాదాపు 80 వేల కేసులు నమోదు అవుతున్నాయి.. దాదాపు ప్రతి నెల 200 కోట్ల రూపాయలను సైబర్ నెరగాళ్లు కొల్ల కొడుతున్నట్టు తాజా సర్వే బయటపెట్టింది..

Read Also: TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ.. ఇది మాత్రం మరవొద్దు..!

దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై సర్వే నిర్వహించారు.. డెబిట్, క్రెడిట్ కార్డుతో పాటు ఆన్‌లైన్‌ పేమెంట్లతో సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు ప్రజలు.. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ప్రజలు సైబర్ నేరగాల బారిన పడుతున్నారు.. సగటున తెలంగాణలో 9 కేసులు నమోదు అవుతున్నాయంటే.. ఏ స్థాయిలో సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.. గ్రేటర్ హైదరాబాద్‌లోని పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్లు (హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ) పరిధిలో దాదాపు 5వేల కేసులు నమోదు అయినట్టు ఆ సర్వే పేర్కొంది.. కొత్త తరహా మోసాలకు తెరలేపుతూ అనుమానం రాకుండా పని కానిస్తున్నారు సైబర్ నేరగాళ్లు… రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా ఉన్నట్టు పోలీసు రికార్డు చెబుతున్నాయి. ఇక, గత మూడేళ్లలో నమోదైన కేసుల్లో కేవలం 17 శాతం కేసుల్లో మాత్రమే బాధితుల సొమ్మును రికవరీ చేశారట.. సగటున ప్రతి 10 మందిలో నలుగురు సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నట్టు ఆ సర్వేలో తేలడం ఆందోళనకు గురిచేసే అంశం.

Exit mobile version