Site icon NTV Telugu

Road Accident: చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌ డెడ్

Road Accident

Road Accident

Road Accident: పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు.. ట్రాక్టర్ల లోడుతో ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే స్పందించిన అక్కడి ప్రజలు, పోలీసులు.. తీవ్రగాయాలపాలైన ఇద్దరిని.. సమీప ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి అధిక వేగమే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంతో బైపాస్ రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ విషాదకర ఘటన పల్నాడు జిల్లాలో విషాద ఛాయలు నింపింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Read Also: Parakamani Theft Case: పరకామణి చోరీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Exit mobile version