NTV Telugu Site icon

Gujarat: గుజరాత్‌లో ఘోర విషాదం.. కారులో ఊపిరాడక నలుగురు చిన్నారుల మృతి

Gujarat

Gujarat

గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. చిన్నారుల ఆటలు విషాదాన్ని మిగిల్చాయి. నలుగురు చిన్నారులు చనిపోవడంతో తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. ఈ ఘటన అమ్రేలి జిల్లాలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Sridevi: రజనీకాంత్ తో శ్రీదేవి పెళ్లి ప్లాన్? బోనీ కపూర్‌ వల్ల మొత్తం మటాష్!

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా రంధియా గ్రామానికి చెందిన దంపతులు.. వ్యవసాయ పనుల కోసం ఉదయం 7:30 గంటలకు ఏడుగురు పిల్లలను ఇంట్లో వదిలివెళ్లారు. దీంతో చిన్నారులు ఆడుకుంటూ ఇంటి సమీపంలో ఉన్న ఓ కారులో దూరారు. అయితే కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు విగతజీవులుగా మారారు. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి పిల్లలు కనిపించకపోవడంతో చుట్టూ వెతికారు. పార్క్ చేసిన కారులో చూడగా.. చిన్నారులు విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో ఆ పేరెంట్స్ ఒక్కసారిగా కుప్పుకూలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. పిల్లలు ఆడుకుంటూ కారులోకి దూరడంతో ఊపిరాడక చనిపోయారని పోలీసులు తెలిపారు. పొలం యజమాని కారులో చిన్నారులు చనిపోయారని వెల్లడించారు. అమ్రేలి (తాలూకా) పోలీస్‌స్టేషన్‌లో ప్రమాదవశాత్తూ చనిపోయినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Hyundai Verna: కొత్త కలర్స్‌లో రిలీజైన్ హ్యుందాయ్ వెర్నా..

Show comments