Uttar Pradesh: దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. పోక్సో, నిర్భయ వంటి కఠినమైన అత్యాచార నిరోధక చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులు మాత్రం అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. చాలా సందర్భాల్లో తెలిసిన వ్యక్తుల నుంచే అత్యాచారాలకు గురవుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఐదేళ్ల బాలికపై పొరుగున ఉండే టీనేజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
Read Also: XPoSat: న్యూ ఇయర్ రోజే ఇస్రో ‘‘ఎక్స్‌పోశాట్’’ ప్రయోగం.. మిషన్ లక్ష్యాలు ఇవే..
వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు, 5 ఏళ్ల బాలికను తన గ్రామం నుంచి సైకిల్‌పై ఇంటిలో దించే ముందు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగినట్లు సిరాతు సీఐ అవధేష్ కుమార్ విశ్వకర్మ తెలిపారు. బాలిక పరిస్థితిని చూసిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం పంపనున్నట్లు తెలిపారు.