Site icon NTV Telugu

Crime News: ఏపీలో డెడ్‌బాడీల కలకలం

Ap Dead Bodies Case

Ap Dead Bodies Case

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఐదు డెడ్‌బాడీలు లభ్యమయ్యాయి. గుంటూరులో రెండు, కడప (వైఎస్సార్ జిల్లా)లో మూడు దొరికాయి. గుంటూరులో లభ్యమైన మృతదేహాలు యువతి, యుకుకుడివిగా గుర్తించారు. తెనాలిలోని రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో వీరి మృతదేహాలు కనిపించాయి. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని స్థానికులతో పాటు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైలు వేగంగా గుద్దడంతో గుర్తించలేనంతగా వీరి తలలు పగిలాయి. ఐడి కార్డు ఆధారంగా.. ఈ యువ జంట చేబ్రోలు మండలం, బ్రాహ్మణ కోడూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

ఇక కడపలో లభ్యమైన మూడు మృతదేహాల ఘటన మాత్రం తీవ్ర కలకలం రేపుతోంది. రాయిచోటి రహదారి గువ్వల చెరువు ఘాట్ వద్ద గొర్రెల కాపురులు పని మీద వెళ్లగా.. ఈ శవాలు వెలుగులోకి వచ్చాయి. మరీ కుళ్లిపోయి ఉండటంతో.. వారం రోజుల క్రితమే చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురిలో ఇద్దరు పురుష, ఒక మహిళ మృతదేహం ఉండటంతో.. పక్కా ప్లాన్ ప్రకారమే వీరిని ఎక్కడో చంపేసి, ఘాట్‌ రోడ్‌లోని లోయల పడేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే.. ఈ ముగ్గురి ఆచూకీ ఏంటో తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version