Site icon NTV Telugu

First Night Accident: ఫస్ట్ నైట్ రోజే ప్రమాదం.. 26 కుట్లతో ప్రాణాలు కాపాడుకున్న నూతన వరుడు

First Night Accident

First Night Accident

First Night Accident: అతనికి ఒక రోజు ముందే పెళ్ళి జరిగింది. పెళ్లైన మరుసటి శోభనంకు ఏర్పాట్లు చేశారు. శోభనం జరిగిన తరువాత పెళ్లి కొడుకు మంచంపై విశ్రాంతి తీసుకుంటూ పడుకొని ఉన్నాడు. ఉన్నట్టుండి పెళ్లి కొడుకు పెద్దగా కేకలు వేయడంతో ఏమీ జరిగిందోనని పెళ్లి కూతురు బంధువులు గదిలో వెళ్లి చూడగా.. పెళ్లి కొడుకు రక్తపు మడుగులో ఉన్నాడు. అతనిపై సీలింగ్‌ ఫ్యాన్‌ ఊడిపడటంతో తల కింద మెడభాగంలో బాగా కోసుకుపోయి రక్తం వరదలా కారుతోంది.. మెడతోపాటు చేయికి కూడా గాయం అయింది. వెంటనే అతన్ని ఆసుప్రతికి తీసుకెళ్లారు.. వైద్యులు తక్షణ వైద్య చికిత్సను అందించి.. అతనికి మెడ భాగంలో కుట్లు వేసి చికిత్సను పూర్తి చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Read also: Daaku Haseena: 10 రూపాయల ఫ్రూటీ.. రూ. 8 కోట్ల దోపిడీ నిందితుల్ని పట్టించింది.. ఎలాగో తెలుసా..?

రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా దివానా ప్రాంతంలోని మక్రానా పట్టణంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఇక్రమ్‌ కుటుంబ సభ్యులు చెప్పిన సమాచారం ప్రకారం ఈ సంఘటన జూన్ 10 న మక్రానా పట్టణంలో జరిగింది. గౌడబస్ మొహల్లా నివాసి ఇక్రమ్ సిసోడియాకు జూన్ 9న వివాహం జరిగింది. ఇక్రమ్ అబ్దుల్ సరాయ్ నివాసి జన్నత్‌ను వివాహం చేసుకున్నాడు. జూన్ 9 రాత్రి పెళ్లికి సంబంధించిన అన్ని లాంఛనాలు పూర్తయ్యాయి. ఆచారాల ప్రకారం ఇక్రమ్ భార్య జన్నత్ మరుసటి రోజు ఉదయం తన తల్లి ఇంటికి తిరిగి వచ్చింది.

Read also: Garlic Side Effects: వెల్లుల్లి ఎక్కువగా తింటున్నారా?.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!

పెళ్లి తర్వాత జరిగిన శోభనం గదిలో ఆలసిపోయి పడుకున్నాడు కొత్తపెళ్లి కొడుకు ఇక్రమ్. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గదిలోంచి ఇక్రమ్ కేకలు వినిపించడంతో అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో ఇక్రమ్‌ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని మెడ, ఒక చేతికి రక్తం కారుతోంది. ఇది చూసిన బంధువులు షాక్‌కు గురయ్యారు. సీలింగ్‌ ఫ్యాన్‌ కిందపడటంతో తీవ్ర గాయాలైనట్టు గుర్తించారు. బంధువులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు తగు చికిత్స అందించి ఇక్రమ్‌ ప్రాణాలు కాపాడారు. ఫ్యాన్‌ బ్లేడ్‌ మెడకు తగలడంతో తెగిన చోట డాక్టర్లు 26 కుట్లు వేశారు. ప్రస్తుతం గాయపడిన కొత్త పెళ్లి కొడుకు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. శోభనం గదిలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ పాతది కావడం వల్లే అది ఊడి పెళ్లి కొడుకు పడుకున్న మంచంపై పడిందని ఇక్రమ్ తండ్రి షేక్ రంజాన్ తెలిపారు. యువకుడు ప్రమాదం నుంచి తప్పించుకోవడం సంతోషించదగ్గ విషయమని స్టేషన్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ శర్మ తెలిపారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంజాబ్‌లోని అంబాలాలో ఇక్రమ్‌కు మార్బుల్ వేర్‌హౌస్ ఉంది. ఈక్రమంలో మెడకు ఇరువైపులా ఉన్న రక్తనాళాలు తెగిపోయి తీవ్ర రక్తస్రావమైందని ప్రభుత్వాసుపత్రి ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ ఫరూక్‌ తెలిపారు.

Exit mobile version