NTV Telugu Site icon

Bihar: బీహార్‌లో దారుణం.. కళ్లలో కారం చల్లి, కత్తులతో పొడిచి దారుణహత్య..

Bihar

Bihar

Bihar: బీహార్ రాష్ట్రంలో నవాడాలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై 20 ఏళ్ల యువకుడిని దుండగులు హత్య చేశారు. నిందితుడు ముందుగా యువకుడి కళ్లలో కారం చల్లి, ఆ తర్వాత కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. వారణాసిలో చదువుతున్న రాహుల్ కుమార్ అనే యువకుడు ఛత్ వేడుకల కోసం సొంతూరికి వచ్చాడు. హత్య జరిగే రోజు రాహుల్‌కి ఒకరి నంచి ఫోన్ వచ్చింది. పోలీసులు ప్రాథమిక విచారణ సందర్భంగా.. కేఎల్ఎస్ కాలేజీ దగ్గరకు రావాల్సిందిగా రాహుల్‌కి ఫోన్ వచ్చింది.

Read Also: Namo Movie: నరేంద్ర మోడీ అనుకునేరు… కామెడీ సినిమా టైటిల్!

అయితే ఈ హత్యకు కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రాహుల్ కుమార్(20)ని 35-40 ఏళ్ల మధ్య వయసున్న గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపినట్లు అక్కడి సీసీటీవీలో రికార్డైంది. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని డీఎస్పీ అజయ్ ప్రసాద్ తెలిపారు. యువకుడు దాడికి గురవుతున్నా కూడా రోడ్డుపై నుంచి వాహనాలు, పాదచారులు వెళ్తున్నారు తప్పితే, కాపాడే ప్రయత్నం ఒక్కరూ చేయలేదు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నల్ని లేవనెత్తింది. కనీసం పోలీసులకు ఏ ఒక్కరూ కూడా ఫోన్ చేయలేదు.

ఘటన గురించి తెలిసి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే యువకుడు మరణించాడు. మృతదేహానికి సమీపంలో ఉన్న మొబైల్ ఫోన్ ఆధారంగా వ్యక్తిని గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాహుల్ కుమార్ తండ్రి వాసుదేవ్ ప్రసాద్, తల్లి ముంగేర్ జైలులో మహిళా కానిస్టేబుల్‌గా ఉన్నారు.

Show comments