కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడిల్సిన కన్నతండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ నీచుడు కన్న కూతురిపైనే కన్నేశాడు. కూతురిపై అనుమానంతో నీచానికి దిగజారాడు. వైద్య పరీక్షలు చేయించడానికి హాస్పిటల్ కి తీసుకెళ్తానని నమ్మించి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. రేణిగుంట మండలం గురవరాజు పల్లె గ్రామంలో ఖాదర్ బాషా, నజియా దంపుతులు నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె. మొదటి నుంచి డబ్బు కోసం కక్కుర్తి పడే ఖాదర్ బాషా డబ్బు కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకొని జైల్లో పెట్టారు. ఇక ఇటీవల జైలు నుంచి బయటికి వచ్చినా అతడిలో మార్పు రాలేదు. భార్య, కూతురిపై అనుమానం పెంచుకొని వారిని తిట్టి, కొట్టి వేధించసాగాడు. దీంతో భార్య విసిగిపోయి కూతురుతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా ఖాదర్ బాషా వదలలేదు. తాను మారిపోయానని, తనకు భార్యాపిల్లలు కావాలని పంచాయితీలో రచ్చ చేసి భార్యను, కూతురును ఇంటికి తెచ్చాడు.
కొన్ని రోజులు బాగానే ఉన్న అతడిలో మరోసారి మృగం బయటపడింది. కూతురు ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతుందని అనుమానించి, ఆమెకు వైద్య పరీక్షలు చేయించాలని ఆదివారం హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. మార్గమధ్యంలో నిర్మానుష్యమైన ప్రదేశంలో బండి ఆపి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఇంట్లో చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో కుమార్తె మౌనంగా ఉండిపోయింది. సాయంత్రం కూతురు ముభావంగా ఉండడంతో తల్లి నిలదీయగా తండ్రి బాగోతం బయటపెట్టింది. తన అకృత్యం భార్యకు తెలియడంతో ఖాదర్ బాషా ఇంట్లో నుంచి పరారయ్యాడు. సోమవారం ఉదయం నజియా.. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఖాదర్ బాషా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
