Site icon NTV Telugu

Fake Lady Constable : నకిలీ లేడీ కానిస్టేబుల్ అరెస్ట్.. వీఐపీ బందోబస్తుల్లో కూడా ‘డ్యూటీలు’

Constable

Constable

Fake Lady Constable : హైదరాబాద్‌లో నకిలీ ఖాకీ వ్యవహారం వెలుగుచూసింది. జీడిమెట్ల పోలీసు పరిధిలో నకిలీ లేడీ కానిస్టేబుల్‌గా వ్యవహరించిన ఉమాభారతి అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. కానిస్టేబుల్‌ పోస్టుకి సెలెక్ట్ కాలేకపోయినా, తాను పోలీసు సిబ్బందిలోనే పనిచేస్తున్నట్లు చాటుకునేలా ఖాకీ డ్రెస్‌ కొనుగోలు చేసి, పలు వీఐపీ కార్యక్రమాలకు బందోబస్తు డ్యూటీలు చేసిన విషయం బయటపడింది.

తెలంగాణ పోలీసు కానిస్టేబుల్‌ అర్హత పరీక్షలకు ప్రిపేర్ అవుతూ, పోలీసులలో పనిచేయాలనే కోరికతో ఉమాభారతి ముందుగా డ్రెస్‌ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం హైదరాబాదులో జరిగిన కీలక వీఐపీ కార్యక్రమాల్లో.. సచివాలయంలో జరిగిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ఖైరతాబాద్ గణేష్‌ ఉత్సవాల ఊరేగింపు వంటి ఈవెంట్లలో బందోబస్తుల పేరుతో తిరిగినట్లు వెల్లడైంది.

Betting Apps: సెలబ్రిటీలు ఏం చేసినా జై కొట్టాల్సిందేనా..?

సైబరాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కి కూడా వెళ్లి, అక్కడి క్యాంటీన్‌లో గడిపి వెళ్లిపోయిన విషయం విచారణలో బయటపడింది. అంతేకాకుండా పలు కాలేజీల్లోకి వెళ్లి ‘సైబర్ క్రైమ్ అవేర్‌నెస్’ పేరుతో లెక్చర్లు ఇచ్చిందని కూడా పోలీసులు గుర్తించారు. ఒక దశలో ఉమాభారతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను ప్రశ్నించడంతో మొత్తం నకిలీ ఖాకీ డ్రామా బట్టబయలైంది. అసలు పోలీసు ఉద్యోగం లేకపోయినా, అధికారులు, సిబ్బంది తెలియకుండా వీఐపీ డ్యూటీలను కూడా ఎలా చేసిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leopard Attack: శభాష్ బేటా.. చిరుతతో పోరాడిన 11 ఏళ్ల బాలుడు..

Exit mobile version