NTV Telugu Site icon

FaKe Engine Oil Gang Busted: నకిలీ క్యాస్ట్రాల్ ఆయిల్ గ్యాంగ్ గుట్టురట్టు

Oil1

Oil1

నకిలీల గొడవ ఎక్కువైంది. పాలు బాగా కల్తీ అవుతున్నాయి. వివిధ పేర్లతో నకిలీ గ్యాంగ్ లు హల్ చల్ చేస్తున్నాయి. నెయ్యి, గుట్కాలు, బిస్కెట్లు, కారం, పసుపు.. ఇలా కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్గుగా కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. తాజాగా ఇంజన్ ఆయిల్ విషయంలోనూ మనం అప్రమత్తంగా వుండాల్సిన తరుణం ఇది. మీకు టూ వీలర్ వుందా.. మీ బండిలో వేసే ఇంజన్ ఆయిల్ ఒరిజనల్ అవునా కాదో అని చెక్ చేసుకోవాలి. వికారాబాద్ జిల్లాలో నకిలీ ఇంజన్ ఆయిల్ తయారీ గుట్టుగా సాగిపోతోంది. నకిలీ క్యాస్ట్రాల్ ఆయిల్ తయారు చేస్తున్న ఆఫీస్ పై వికారాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు.

Read Also: Telugu Bhasha Dinotsavam: ‘తెలుగదేల?’ అంటున్న సినీజనం!

వికారాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల దాడుల్లో నకిలీ ఇంజిన్ ఆయిల్ పట్టుబడింది. వేలాది ఇంజిన్ ఆయిల్ బాటిల్స్ పోలీసులకు చిక్కాయి. నిజానికి మనం CASTROL ACTIV అనే పేరుతో ఇంజిన్ ఆయిల్ కొంటుంటాం. కానీ కేటుగాళ్లు సామాన్యులను కాస్త పేరు మార్చి బురిడీ కొట్టిస్తున్నారు. costrel పేరుతో నకిలీ ఇంజన్ ఆయిల్ తయారు చేస్తున్నారు. ఈ దాడుల్లో ఈ తరహా ఇంజిన్ ఆయిల్ బాటిల్స్ భారీగా సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆయిల్ వున్న భారీగా డ్రమ్ముల్ని పట్టుకున్నారు. ఈ క్యాస్ట్రాల్ డూప్లికేట్ ఆయిల్ తయారుచేసే యంత్రం, భారీగా ఖాళీ డబ్బాలను, వాటిపైన అంటించే లేబుల్ స్టిక్కర్ కార్టన్స్.. వంటి వాటిని సీజ్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించి ఫిరోజ్ అనే యువకున్ని అదుపులో కి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వికారాబాద్ పట్టణంలోని ఫిరోజ్ అనే యువకుడు ఒక మిషిన్ తెచ్చుకొని దానికి సంబంధించిన స్టిక్కర్ ఖాళీ డబ్బాలు సేమ్ ఒరిజినల్ కంపెనీకి సంబంధించి వాటిని తలపిస్తూ costrel పేరు తో ఒక పదం చేంజ్ చేసి డబ్బాల పై వేరే కంపెనీకి సంబంధించిన ఆయిల్ ను డబ్బా లలో పోసి తయారుచేసి అమ్ముతున్నాడు.. క్యాస్ట్రోల్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఇక్కడికి వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఫిరోజ్ అనే యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మీరు మీ టూ వీలర్ కి వాడే ఇంజిన్ ఆయిల్ విషయంలో ఒకసారి చెక్ చేసుకోండి. కాస్త డబ్బులు తక్కువ అని డూప్లికేట్ ఆయిల్ వాడితే మీ బండి పని అయిపోతుంది. తర్వాత రిపేర్లకు వేలకు వేలు పెట్టాల్సి వస్తుంది.

Read Also: Telangana Crime Rate : తెలంగాణలో పెరిగిన క్రైం రేట్‌..