Site icon NTV Telugu

Fake Dentist : 20 ఏళ్లుగా డాక్టర్‌గా చెలామణి.. పదో తరగతి కూడా పాస్ కాలేదు! నేరెడ్‌మెట్ రమేష్ నిర్వాకం ఇదీ..

Fake Dentist

Fake Dentist

Fake Dentist : చదివింది పదో తరగతి.. అది కూడా పూర్తి చేయలేదు.. కానీ తాను డెంటల్ డాక్టర్‌నని కలరిస్తున్నాడు. అందరూ ఉదయం నుంచి రాత్రి వరకు క్లినిక్ నడిపిస్తుంటే.. అతను మాత్రం రాత్రి నుంచి ఉదయం వరకు క్లినిక్‌లో సేవలు అందిస్తున్నాడు. నకిలీ పత్రాలతో డెంటల్ డాక్టర్‌గా మోసం చేస్తూ 20 ఏళ్ల పాటు జనాన్ని మోసం చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ డాక్టర్ చీటర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు?

READ ALSO: Pawan Kalyan : డీలిమిటేషన్‌పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఆ వ్యక్తి పేరు డాక్టర్ రమేష్. సారీ.. సారీ .. ఫేక్ డాక్టర్ రమేష్. 20 ఏళ్ల క్రితమే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి.. హైదరాబాద్‌లో మకాం పెట్టాడు. తాను డెంటల్ డాక్టర్‌నని 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లో దుకాణం తెరిచాడు. రెండు దశాబ్దాల నుంచి క్లినిక్‌లో ప్రజలకు చికిత్సలు అందిస్తున్నాడు. ముఖ్యంగా రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే క్లినిక్ నడపడం ఇతని స్పెషాలిటీ. అంతే కాదు ఈ నకిలీ డాక్టర్ ఇటీవల శంషాబాద్‌లో ఏకంగా పెద్ద ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. కానీ స్థానిక వైద్యుల అప్రమత్తతతో అతని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీన్ కట్ చేస్తే.. పోలీసుల విచారణలో అతను నకిలీ డాక్టరని తేలింది. దీంతో ఆ నకిలీ డాక్టర్ రమేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద సరైన పత్రాలు కూడా లేనట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు అతను పదో తరగతి కూడా పాస్ కాలేదనే విషయం విచారణంలో బయటపడింది. వైద్యం అంటే జనాల ప్రాణాలతో సంబంధం ఉన్న వృత్తి. అర్హతలేని వారి చేతుల్లో అది ప్రమాదకర ఆయుధంగా మారే అవకాశం ఉందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

READ ALSO: Lightning Strikes: ఆకాశంలో విమానంపై పిడుగు పడితే ఏమవుతుందో తెలుసా? ఆసక్తికర నిజాలు ఇవే!

Exit mobile version