Site icon NTV Telugu

Fake Cop: బొమ్మ తుపాకీతో డబ్బులు వసూల్ చేస్తున్న నకిలీ పోలీస్.. పట్టుకున్న పోలీసులు

Untitled Design (8)

Untitled Design (8)

ఉత్తర్ ప్రదేశ్ లో బొమ్మ తుపాకీ పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్న నకిలీ పోలీసును .. అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు ఓ వ్యాపారిని 5వేలు ఇవ్వాలని లేకపోతే ఎన్ కౌంటర్ చేస్తానని బెదిరించాడు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Read Also:Brave Woman: ప్రాణాలను పణంగా పెట్టి కొండచిలువను పట్టుకున్న మహిళ

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని సంబాల్ లో ఒక నకిలీ పోలస్ ను పట్టుకున్నారు. ఖాకీ యూనిఫాం ధరించి.. బొమ్మ తుపాకీతో తిరుగుతున్న విష్ణుబాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. పోలీసు యూనిఫాం ధరించి 5వేల రూపాయలు ఇవ్వాలని.. లేక పోతే ఎన్ కౌంటర్ చేస్తానని ఓ వ్యాపారిని బెదిరించాడు. అతుడు బ్లూ కలర్ షూ వేసుకోవడంతో అనుమానించి ఆ వ్యక్తిపై అనుమానం వచ్చిన వ్యాపారి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న నిజమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Read Also:Classic 650 Launch: సరికొత్త స్టైలిష్ లుక్ తో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 లాంచ్..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విష్ణుబాబు అనే నిందితుడు.. నిజమైన పోలీస్ కాదని.. అతని దగ్గర ఉన్న పిస్టల్ కూడా నిజమైనది కాదని పోలీసులు వెల్లడించారు. నడుముకు బొమ్మ తుపాకీని పెట్టుకుని నకిలీ అధికారిగా నటిస్తున్నాడని తెలిపారు. ప్రస్తుతం అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపామన్నారు. పోలీసులు యూనిఫాం, బ్యాడ్జ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే…. విష్ణుబాబు మొదట్లో పోలీస్ కావాలని ప్రయత్నించాడని.. కానీ పోలీస్ గా సెలెక్ట్ కాకపోవడంతో ఇలా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Exit mobile version