Site icon NTV Telugu

Shocking incident: ఇంటికి వెళ్తున్న బాలికపై తాగుబోతు వేధింపులు.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు..

Crime

Crime

Shocking incident: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ బాలికపై మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డైంది. కాన్పూర్‌లోరని రావత్‌పూర్‌లో మంగళవారం రాత్రి 8 గంటలకు ఘటన చోటు చేుసుకుంది. మద్యం షాపు వద్ద మద్యం మత్తులో ఉన్న వ్యక్తి బాలిక వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని వేధింపులకు పాల్పడ్డాడు.

READ ALSO: PM Modi: రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ విదేశీ టూర్‌లకు టికెట్లు బుక్ చేసుకున్నారు..

సమాచారం ప్రకారం.. సమీపంలోని మద్యం దుకాణానికి సమీపంలో ఉన్న షాపు నుంచి కూరగాయలు కొనుక్కుని ఇంటికి వెళ్తున్న బాలిక వేధింపులకు గురైంది. బాలిక వెనక నుంచి వచ్చి ఆమె అరవకుండా నోరు మూసేసి, కింద పడేసి అఘాయిత్యానికి పాల్పడే యత్నం చేశాడు. బాలిక తీవ్ర నిరసన తెలపడంతో, స్థానికంగా ఉన్న బాటసారులు అటువైపుగా రావడంతో బాలికను వదిలేసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఈ ఘటన వైరల్ కావడంతో ఆ ఏరియా డీసీసీ సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మొత్తం 5 మందిని అదుపులోకి తీసుకుని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version