Dowry harassment: అన్యోన్యంగా సాగాల్సిన సంసారంలో భర్త కట్న పిచాశిగా మారాడు. ఉత్తర్ ప్రదేశ్ లక్నోకి చెందిన 40 ఏళ్ల మహిళను దారుణంగా వేధించాడు. చైనాలో ఉద్యోగం చేసే భర్త, ఆ దేశంలో ఉన్న సమయంలో ఆఫ్రికా వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని, అశ్లీల చిత్రాలను చూడాలని ఒత్తిడి చేసేవాడని ఆమె ఆరోపించింది. భర్తపై వరకట్న వేధింపులు, గృహహింసకు పాల్పడినట్లు ఆమె చెప్పింది. తాను చైనాలో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించానని, వారి సాయంతో భారత్ చేరుకున్నట్టు ఆమె తెలిపింది. రాయబార కార్యాలయం సలహాతో ఆమె లక్నోలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల ప్రకారం.. 2015లో లక్నోలో బాధిత మహిళకు లక్నలోని గణేష్ గంజ్‌లో ఉండే వ్యక్తితో వివాహమైంది. అతను చైనాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెళ్లియిన మొదటివారంలోనే రూ. 15 లక్షల కట్నం ఇవ్వాలని భార్య తల్లిదండ్రుల్ని బలవంతం చేశాడు. ఆ తర్వాత వీరికి ఓ కుమార్తె జన్మించింది. అయితే, ఆడబిడ్డ పుట్టడంతో అత్తామామల వేధింపులు కూడా ఎక్కువైనట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. 2020లో కరోనా సమయంలో తన భర్త ఇండియాకి వచ్చిన సమయంలో తన వీసా, విమాన టికెట్లు, రూ. 2 లక్షలు తీసుకున్నట్లుగా ఆమె పేర్కొంది. చైనాకు వెళ్లిన సమయంలో మహిళని ఆమె భర్త బెదిరింపులకు గురిచేశాడని, దీంతో భారత రాయబార కార్యాలయంలో ఫిర్యాదు చేసిందని స్టేషన్ ఎస్‌హెచ్ఓ వీరేంద్ర త్రిపాఠి తెలిపారు.