Site icon NTV Telugu

Delhi : 85 ఏళ్ల వృద్దురాలు పై అత్యాచారం.. బ్లేడుతో పెదాలను కోసి..

Delhi

Delhi

మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో రకాల శిక్షలను అమలు చేస్తుంది.. కొత్త చట్టాలను తీసుకొని వస్తుంది కానీ కామ కోరికలతో మృగాళ్ళు వావి వరుసలు లేకుండా రెచ్చిపోతున్నారు.. పాలు తాగే పసికందును కూడా వదలట్లేదు.. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగు చూసింది 85 ఏళ్ల వృద్దురాలు పై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు.. ఈ దారుణ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.. ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్ ప్రాంతంలో 85 ఏళ్ల మహిళపై 28 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు..

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్ ప్రాంతంలో శుక్రవారం 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఈ సంఘటన మీద చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.. వృద్దురాలిపై అత్యాచారం చేసిన ఘటన పై నిందితుడు 28 ఏళ్ల ఆకాష్‌గా గుర్తించారు పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు..

ఢిల్లీ మహిళా కమిషన్ తన ఎక్స్ హ్యాండిల్‌లో ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వృద్ధురాలు తన ఇంట్లో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. నిందితుడు మహిళ ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను మహిళను కొట్టి, బ్లేడుతో పెదవులను కోశాడు.. వృద్ధురాలి ముఖానికి, ప్రైవేట్ పార్ట్స్ లో తీవ్ర గాయాలయ్యాయి.. ఈ దారుణ ఘటన పై చీఫ్ స్వాతి తీవ్రంగా మండి పడ్డారు.. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని పోలీసులకు హెచ్చరింది.. ప్రస్తుతం వృద్దురాలుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.. పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Exit mobile version