Site icon NTV Telugu

Physical Harassment : రాచకొండలో దారుణం.. దివ్యాంగురాలిపై అత్యాచారం, ఆత్మహత్య

Punerape

Punerape

Physical Harassment : రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర ఘటన వెలుగుచూసింది. దివ్యాంగురాలైన చెవిటి, మూగ యువతిపై స్థానిక యువకుడు అత్యాచారం చేసి, తరచూ వేధింపులకు గురిచేశాడు. చివరికి మానసిక వేదన తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కుటుంబం జీవనోపాధి కోసం హైదరాబాద్ ఆల్మాస్‌గూడలో నివాసం ఉంటోంది. ఆ కుటుంబానికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆ ఇద్దరు కుమార్తెలు దివ్యాంగురాళ్లు. వారి ఇంటికి ఎదురుగా శ్రీకాంత్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు.

Pragya Jaiswal : టాప్ లెస్ డ్రెస్ లో రెచ్చిపోయిన ప్రగ్యాజైస్వాల్..

ఇటీవలి కాలంలో శ్రీకాంత్ ఆ కుటుంబంలో పెద్ద కుమార్తె (21)తో పరిచయం పెంచుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువతిపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బయటపెడితే కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించేవాడు. తర్వాత కూడా ఆమెను తరచూ వేధింపులకు గురిచేసినట్లు సమాచారం.

వేధింపులు ఎక్కువవుతున్నాయని గమనించిన బాధితురాలి సోదరి ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పమని అక్కను కోరింది. అప్పుడు బాధితురాలు తనపై జరిగిన లైంగిక దాడి, వేధింపుల వివరాలను సోదరికి వెల్లడించింది.

ఈ వేదన తట్టుకోలేక బాధితురాలు ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఘటనను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శ్రీకాంత్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. సోదరి వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Rajahmundry: రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ ఉద్రిక్తత.. భారీగా తరలివచ్చిన వైసీపీ శ్రేణులు..

Exit mobile version