Site icon NTV Telugu

Dharmavaram Murder: పడగ విప్పిన ఫ్యాక్షన్ .. ధర్మవరంలో అచ్చం సినిమా తరహా మర్డర్

Dharmavaram Murder

Dharmavaram Murder

Dharmavaram Murder: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ పడగ విప్పిందా? ధర్మవరం పట్టణంలో పట్ట పగలే జరిగిన మర్డర్ వెనుక కారణాలేంటి? చనిపోయింది ఎవరు? హత్య చేసింది? ఎవరు ఫ్యాక్షన్ రగడా? పాతకక్షలా? అసలు కారణాలేంటి? రాయలసీమ అంటేనే.. ఫ్యాక్షన్.. ఫ్యాక్షన్ అంటే రాయలసీమ అనేలా పేరు పడిపోయింది. అక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు.. సినిమాల ప్రభావం కావచ్చు.. రాయలసీమకు ఆ పేరు వచ్చేసింది. ఇప్పుడు తాజాగా అలాంటి సీనే రిపీట్ అయింది.. అచ్చం సినిమాల్లో చూపించే విధంగా సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ మర్డర్ జరిగింది. దుండగులు కారులో ఓ వ్యక్తిని ఫాలో అయ్యారు. అతన్ని కారుతో ఢీకొట్టారు. కింద పడిపోయాక వెంటనే కారులో నుంచి దిగి.. వేట కొడవళ్లతో విచక్షణారహితంగా నరికేశారు. బైక్‌ మీద ఉండే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి…

READ ALSO: ప్రాణాలు తీస్తున్న డీజే సౌండ్స్ – యువత ఆరోగ్యానికి ముప్పు

వేటకొడవళ్ల దాడిలో చనిపోయిన వ్యక్తి పేరు తలారి లోకేంద్ర. ధర్మవరంలో అతనిపై రౌడీషీట్ నమోదైంది. గతంలో గంజాయికి అలవాటు పడి కేవలం 10 రూపాయల కోసం రైల్వే స్టేషన్ సమీపంలో రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని చంపేశాడు. అంతే కాదు 45 ఏళ్ల ఓ మహిళను మద్యం తాగేందుకు పిలిచి.. బాగా తాగించాడు. ఆ తర్వాత వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశాడు. కానీ ఆమె అంగీకరించకపోవడంతో బండరాయితో తలపై మోది దారుణంగా హత్య చేశాడు. దీంతో పోలీసులు అతనిపై మర్డర్ కేసు పెట్టారు…

మరోవైపు డ్రగ్స్‌కు బానిసై ఆ మత్తుల్లో ధర్మవరంలో నిత్యం ఏదో ఓ గొడవ పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో అతనిపై పోలీసులు ఇటీవలే రౌడీషీట్ తెరిచారు. రామకృష్ణారెడ్డి మర్డర్ కేసులో లోకేంద్ర జైలుకు వెళ్లాడు. ఐతే అతని రాక కోసం ఎదురు చూస్తున్నాడు రామకృష్ణారెడ్డి కొడుకు బాలకృష్ణారెడ్డి. లోకేంద్ర జైలు నుంచి రిలీజ్ కాగానే.. అతనిపై రెక్కీ చేశాడు. అదే క్రమంలో బైక్ పై వెళ్తున్న లోకేంద్రను వెంబడించాడు. కారుతో ఢీకొట్టి కిందపడ్డ తర్వాత వేట కొడవళ్లతో వేటు వేసి చంపేశాడు. అతనికి స్నేహితులు కూడా సహకరించారు… మరోవైపు తలారి లోకేంద్ర హత్య తర్వాత నిందితులు ధర్మవరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెబుతున్నారు..

READ ALSO: Tragedy In Prakasam: కన్నతండ్రే కాలయముడయ్యాడు.. ముగ్గురు పిల్లలను చంపేసి.. తండ్రి ఆత్మహత్య

Exit mobile version