actor harassing wife: అతను రీల్ హీరో.. రియల్‌లో మాత్రం విలన్. యస్ మీరు విన్నది కరెక్టే. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటూ.. హీరోగా ఎదుగుతున్న వ్యక్తి ఇప్పుడు తనలోని విలనిజాన్ని బయట పెట్టాడు. ఏకంగా కట్టుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పంచాయితీ కాస్తా రచ్చకెక్కింది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ధర్మ మహేష్. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోగా రాణిస్తున్నాడు. కానీ నిజ జీవితంలో మాత్రం విలన్‌గా వార్తల్లోకెక్కాడు..
READ MORE: Visakhapatnam gun firing: సాగర తీరంలో కాల్పుల కలకలం..
పేరుకే ధర్మ మహేష్.. కానీ కట్టుకున్న భార్యతో మాత్రం అధర్మంగా వ్యవహరిస్తున్నాడు. ధర్మా మహేష్‌కు 2013లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గౌతమితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో 2019లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. గౌతమితో పాటు ఆమె తండ్రి అందించిన ఆర్థిక సహకారంతో ఇద్దరు కలిసి ఓ హోటల్ ఫ్రాంచైజీ వ్యాపారాన్ని ప్రారంభించారు.
ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్య ధర్మ మహేష్‌కు సినిమా అవకాశాలు పెరిగాయి. అలా అలా.. సిందూరం, డ్రింకర్ సాయి సినిమాలు చేశాడు. రెండు సినిమాలు హీరోగా చేయగానే మనోడి వ్యవహారం పూర్తిగా మారిపోయింది. జల్సాలకు అలవాటు పడ్డాడు. పలువురు యువతులతో తిరుగుతూ భార్యను వేధించడం స్టార్ట్ చేశాడు. తన జల్సాల కోసం అవసరమైన డబ్బులు లేకపోవడంతో భార్యను వేధిస్తున్నాడు. ఆమెను తన ఇంటి నుంచి డబ్బులు తేవాలని ఒత్తిడి చేస్తున్నాడు. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్న సమయంలో తనకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని ఇప్పుడు కట్నంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ప్రతి రోజూ ఇదే విషయంలో ఆమెకు నిత్యం నరకం చూపిస్తున్నాడు. ఈ నరకాన్ని భరించలేక చివరికి భార్య గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వర కట్న వేధింపుల కేసు నమోదు చేశారు..
గతంలో ఇలాగే వేధిస్తే.. భార్య గౌతమి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పట్లో ధర్మ మహేష్‌కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కానీ ధర్మ మహేష్ మాత్రం మారలేదు. మళ్లీ అవే వేధింపులతో ఇప్పుడు వరకట్నం కేసులో ఇరుక్కున్నాడు…
READ MORE: Killer Wife: ప్రియుడి మోజులో పడి.. భర్తను కడతేర్చేందుకు భార్య కుట్ర.. చివరకు
