ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. సైకిల్ పై సమోసాలు తెచ్చుకునేందుకు వెళ్తున్న 13ఏళ్ల బాలుడిపై నుంచి వేగంగా వచ్చిన థార్ కారు దూసుకెళ్లింది. దీంతో బాలుడు చనిపోయాడు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Read Also:Popcorn Lung Disease:మీ పిల్లలకు పాప్ కార్న్ ఇప్పిస్తున్నారా.. అయితే జాగ్రత్త
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. SUV వాహనం బాలుడిని వెనుక నుండి ఢీకొట్టడంతో అతను సైకిల్ పై నుంచి కిందపడిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. బాలుడు ఆర్కేపురంలోని సర్వోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్నాడు
Read Also:Twist: వేరో వ్యక్తితో హోటల్ లో ఉన్న భార్య.. మరో వ్యక్తిపై భర్త దాడి
ప్రాథమిక దర్యాప్తులో థార్ కారు కుడి వైపున వేగంగా నడుపుతున్నందున బాలుడిని ఢీకొట్టినట్లు తేలింది. ఢీకొన్న తర్వాత ఆ కారు ఒక్క క్షణం కూడా ఆగలేదని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. “మేము ఆ ప్రాంతం నుండి సిసిటివి ఫుటేజ్‌లను పొందాము నిందితుడి వాహనం దాని డ్రైవర్‌ను గుర్తించడానికి కృషి చేస్తున్నాము” అని సౌత్ వెస్ట్ డిస్ట్రిక్ట్ డిసిపి అమిత్ గోయెల్ తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసామని డీసీపీ వెల్లడించారు. అనుమానితుడిని పట్టుకోవడానికి అనేక బృందాలను నియమించామన్నారు. డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేసి బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
