Site icon NTV Telugu

Delhi: భార్యా పిల్లలను కడతేర్చిన కసాయి.. చివరకు ఇంటర్నెట్‌లో చదివి భర్త ఆత్మహత్య..

Delhi Police

Delhi Police

Delhi: ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ కసాయి భర్త, భార్యాపిల్లలను అత్యంత దారుణంగా హత్య చేశారు. చివరకు తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈశాన్య ఢిల్లీ షాహదారా జిల్లాలోని జ్యోతి కాలనీలో ఈ ఘటన జరిగింది. పశ్చిమ ఢిల్లీ వినోద్ నగర్లోని ఢిల్లీ మెట్రో డిపోలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న సుశీల్ (45) వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Read Also: IPL 2023: సిరాజ్‌ కొత్త ఇంట్లో ఆర్సీబీ ప్లేయర్స్ సందడి

మంగళవారం ఉదయం సుశీల్, అతని భార్య అనురాధ (40), ఆరేళ్ల కుమార్తె అదితి, కుమారుడు యువరాజ్ ను కత్తితో పొడిచారు. ఈ ఘటనలో భార్య అనురాధతో పాటు కుమార్తె అదితి తీవ్రగాయాలతో మరణించగా, కుమారుడు యువరాజ్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.

భార్య, కుమార్తెను హతమార్చిన తర్వాత సుశీల్ ఉరివేసుకునేందుకు ఎలా తాడును బిగించుకోవాలని చదివి ఆత్మహత్యకు పాల్పడ్డాడని షహదారా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ రోహిత్ మీనా తెలిపారు. హత్య, ఆత్మహత్యలకు కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఫోరెన్సిక్ టీం సంఘటన స్థలంలో ఆధారాల కోసం గాలిస్తున్నారు.

Exit mobile version