ఢిల్లీలో దారుణం జరిగింది. 40 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలను కాల్చి చంపి.. ఇంట్లో తానూ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఢిల్లీలో జరగింది. మరణించిన ఇద్దరు చిన్నారుల వయస్సు 4, 13 ఏళ్లుగా పోలీసులు తెలిపారు. సదరు వ్యక్తి జాఫ్రాబాద్‌కు చెందిన ఇస్రార్ అహ్మద్‌గా గుర్తించారు.
Viral Video: మెట్రో రైలులో ఇద్దరు ప్రేమికులు రచ్చరచ్చ.. !
ఇస్రార్ అహ్మద్ తన భార్య ఫర్హీన్‌కు, కుమార్తెలు ఇనయా,యాషికలకు మత్తుమందు ఇచ్చాడని.. ఆ తర్వాత అతను ముగ్గురిని కాల్చి చంపి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడని ఢిల్లీ నార్తా ఈస్ట్ డీసీపీ సంజయ్ సేన్ వెల్లడించారు. వారు నివసిస్తున్న భవనంలోని నాలుగో అంతస్తు నుంచి మృతదేహాలను వెలికితీశారు. ఘటనా స్థలం నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. దంపతులకు సంబంధించిన పెద్దలు కూడా అదే భవనంలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. జీన్స్ వేర్ వ్యాపారం చేసే ఇస్రార్ అహ్మద్ వ్యాపారంలో నష్టాల కారణంగా ఆర్థికంగా చితికిపోయినట్లు విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని లోతుగా విచారణ ప్రారంభించారు. అతను అసలు కుటుంబంతో సహా చనిపోవడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.
