Delhi: యువతి అద్దె రూమ్‌లో స్పై కెమెరా కలకలం.. బెడ్రూమ్ దృశ్యాలు రికార్డ్.. ఒకరి అరెస్ట్
- దేశ రాజధాని ఢిల్లీలో దారుణం
- యువతి అద్దె రూమ్‌లో స్పై కెమెరా కలకలం
- బాత్రూమ్.. బెడ్రూమ్ దృశ్యాలు రికార్డ్
- ఇంటి యజమాని కొడుకు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ ఇంటి యాజమాని కొడుకు అత్యంత నీచానికి ఒడిగట్టాడు. అద్దె ఇంట్లో ఉంటున్న యువతి దృశ్యాలను స్పై కెమెరా ద్వారా రికార్డ్ చేసి దారుణానికి ఒడిగట్టాడు. పాపం పండి భండారం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడును అరెస్ట్ చేశారు.

Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువతి ఢిల్లీలోని సెకర్‌పూర్‌లోని ఒక అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ సివిల్స్ కోచింగ్ తీసుకుంటుంది. అయితే ఇటీవల ఆమె తన సొంత గ్రామానికి వెళ్లింది. వెళ్లేటప్పుడు ఇంటి తాళాలు.. హౌస్ ఓనర్‌కి ఇచ్చి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన యజమాని కొడుకు కరణ్.. మార్కెట్‌కు వెళ్లి స్పై కెమెరాలు కొనుగోలు చేసి బాత్రూమ్, బెడ్రూమ్ గదుల్లోని బల్బుల్లో అమర్చాడు. కరణ్… అదే ఇంట్లోని మరో అంతస్తులో ఉంటున్నాడు. అయితే ఇటీవల.. యువతి వాట్సప్ గ్రూపులో అసాధారణ కార్యకలాపాలు గుర్తించింది. అంతేకాకుండా ఒక అనుమానిత ల్యాప్‌టాప్‌ను గమనించింది. దీంతో ఆమెకు అనుమానాలు రేకెత్తించి టాయిలెట్ రూమ్ పరిశీలించగా బల్బులో స్పై కెమెరా కనిపించింది. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మరింత సోదాలు చేయగా.. బెడ్రూమ్ గదిలోని మరో బల్బుకు స్పై కెమెరా అమర్చినట్లుగా గుర్తించారు. దీంతో యువతి షాక్‌కు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు కరణ్(30)ను అరెస్ట్ చేశారు.

బయటకు వెళ్లేటప్పుడు కరణ్ తాళాలు అడిగి తీసుకునేవాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆ సమయంలోనే కరణ్.. చేయాల్సిన కార్యక్రమాలను చక్కబెట్టినట్లుగా తెలుస్తోంది. దొంగచాటుగా యువతిని కరణ్ వెంటాడినట్లుగా పోలీసులు గుర్తించారు. స్పై కెమెరాలోని దృశ్యాలు మెమరీ కార్డులో రికార్డు అవుతుంటాయి. ఆ వీడియోలు ల్యాప్‌టాప్‌లో అప్‌లోడ్ చేసుకునేందుకు యువతి దగ్గర తాళాలు తీసుకునే మెమరీ కార్డును తీసుకునేవాడని పోలీసులు కూపీ లాగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కరణ్ ల్యాప్‌టాప్‌లో పోలీసులు కనుగొన్నారు.
కరణ్ నుంచి రికార్డ్ చేసిన వీడియోలను, స్పై కెమెరాలను, రెండు ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై భారతీయ న్యాయ్ సంహిత కింద వోయూరిజం కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం ప్రకారం నిందితుడికి కనీసం ఏడాది పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాధితురాలు సొంత గ్రామానికి వెళ్లినప్పుడు నిందితుడు ఈ దురాగతానికి పాల్పడినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!