NTV Telugu Site icon

Man Hits Daughter In Law: ఉద్యోగం చేస్తానన్న పాపానికి.. ఇటుకతో కోడలిపై మామ దాడి

Man Hits Daughter In Law

Man Hits Daughter In Law

Delhi Man Hits Daughter-In-Law With Brick: తమ భర్తలకు ఆర్థికంగా తోడ్పడేందుకు భార్యలు కూడా ఉద్యోగాలు చేస్తుంటారు. ఈ కాలంలో అయితే.. పురుషులకు తాము ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తూ, అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారు. అలాంటి ఈరోజుల్లో.. ఉద్యోగానికి వెళ్తానన్న పాపానికి, కోడలిపై ఓ మామ ఇటుకతో దాడి చేశాడు. ‘తమ మాట కాదని, ఉద్యోగానికి వెళ్తావా’ అంటూ విచక్షతారహితంగా కొట్టాడు. దాంతో.. ఆ కోడలు తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Tamanna Dead Body : లంచ్‎కు రమ్మన్నారు.. తమన్నాను చంపి డ్రమ్ములో పెట్టారు

ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌లో కాజల్ అనే మహిళ.. తన భర్త ప్రవీణ్ కుమార్‌తో కలిసి అత్తారింట్లో ఉంటోంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో.. ఉద్యోగం చేయాలని కాజల్ నిర్ణయించుకుంది. ఇందుకు భర్త ప్రవీణ్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ.. అత్తామామలు మాత్రం కాజల్ నిర్ణయాన్ని నిరాకరించారు. ఉద్యోగానికి వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంట్లోనూ ఉంటూ ఇంటి పనులు చేసుకుంటే చాలని చెప్పారు. కాజల్ ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. అత్తామామలు వినిపించుకోలేదు. భర్త పడుతున్న ఇబ్బందులు చూడలేక.. కాజల్ ఉద్యోగానికి వెళ్లాలని డిసైడ్ అయ్యింది. బుధవారం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేందుకు, ఇంటి నుంచి బయలుదేరింది.

Camel Milk: ఒంటె పాల‌ను తాగ‌డం వ‌ల్ల ఇన్ని ప్రయోజ‌నాలా..!

వద్దని వారించినా ఇంటర్వ్యూకి వెళ్తుండటంతో కోపాద్రిక్తుడైన మామ.. చేత ఇటుక పట్టుకొని ఆమెని వెంబడించాడు. ఒక చోట ఆమెని అడ్డగించి, ఆ ఇటుకతో కొట్టడం మొదలుపెట్టాడు. మామ నుంచి తప్పించుకోవడానికి కాజల్ ప్రయత్నించినా.. అతడు వెంటాడుతూ ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ దాడిలో కాజల్ తలకు తీవ్ర గాయమైంది. భర్త ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. తలకు 17 కుట్లు పడ్డాయి. కాజల్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. ఆమె మామపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Show comments