NTV Telugu Site icon

Delhi Firing: బర్త్ డే పార్టీలో కాల్పులు.. ఒకరి పరిస్థితి విషమం

Gun

Gun

బర్త్‌డే పార్టీలో విషాదం నెలకొంది. ఓ బర్త్ డే పార్టీలో జరిగిన ఫైరింగ్ లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. 37 ఏళ్ల ప్రమోద్ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఎయిమ్స్ (All India Institute of Medical Sciences) ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నాడు. ఓ సెలబ్రిటీ బర్త్ డే వేడుకలు వైభవంగా జరిగాయి. అయితే, ఈ బర్త్ డే పార్టీలో కాల్పులు చోటు చేసుకోగా.. ఓ బుల్లెట్ ప్రమోద్ కంటి నుంచి దూసుకుపోయింది. వెంటనే స్పందించిన స్నేహితులు హుటాహుటిన తీవ్రంగా గాయపడ్డ ప్రమోద్ ని ఎయిమ్స్ కి తరలించారు.

Read Also: Ambati Rambabu: డ్యాన్స్ ఇరగదీసిన ఏపీ ఇరిగేషన్ మంత్రి.. వీడియో వైరల్

ఏడాది ఢిల్లీలోని ఫతేపూర్ భేరీ లోని జోనాపూర్ విలేజ్ లో ఓ ఏడాది బాలుడి బర్త్ డే పార్టీ జరుగుతోంది. ఈ పార్టీలో వందలాదిమంది పాల్గొన్నారు. ఓ వ్యక్తి అకస్మాత్తుగా కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో కంటి మీద నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. గాయపడ్డ ప్రమోద్ సోదరుడు వినోద్ ఘటన గురించి వివరిస్తూ.. బర్త్ డే పార్టీ జరుగుతుండగా ఏడెనిమిది మంది వ్యక్తులు గుమిగూడారు. ఆ గుంపులోని వ్యక్తి రణ్‌ పాల్ టెర్రస్ మీద నుంచి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ప్రమోద్ గాయపడ్డాడు. ఈ ఘటనకు కారణాలు తెలియరాలేదు. ఎందుకు కాలుస్తున్నావని అడిగితే, రణ్ పాల్ ఆగలేదు.. మరోసారి కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ప్రమోద్ తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: Master Plan: భోగి రోజు భగ్గుమన్న కామారెడ్డి.. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ముగ్గులతో నిరసన