మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని రకాల చట్టాలను తీసుకొచ్చిన వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. వావి వరుసలు కూడా మర్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. తండ్రికి ఫ్రెండ్ కదా అని నమ్మింది.. చివరికి దారుణంగా మోసపోయింది.. అమ్మాయి తల్లీ ఫిర్యాదు చెయ్యడంతో ఈ విషయం బయటకు వచ్చింది..
తమ కామావాంఛ తీర్చుకోవడానికి.. చిన్నా, పెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా.. వరుసలు మరచి పశువులు లాగా రెచ్చిపోతున్నారు. ఆడపిల్ల కనబడితే.. చాలు మ్రుగాళ్ల ప్రవర్తిస్తున్నారు. దారుణ శిక్షలు వేస్తున్నా కూడా కామంధులు వెనక్కి తగ్గడం లేదు. రోజుకో ఎంతోమంది అమాయకపు అమ్మాయిలు బలవుతున్నారు. ఉన్నతస్థాయిలో ఉన్న ఓ ప్రభుత్వ అధికారి తన స్నేహితుడి 14 ఏళ్ల కూతురిపై కన్నేశాడు.. మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు.. చివరికి గర్భవతిని చేశాడు.. భార్య సహకారంతో కడుపును తీసేయించాడు.. ఈ దారుణ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే..2020 లో తన తండ్రిని కోల్పోయింది. ఈ క్రమంలో తన తండ్రి స్నేహితుడు ఆ చిన్నారిపై కన్నేశాడు. తరుచు నిందితుడు ఆ చిన్నారి వచ్చేవాడు. వారి కుటుంబ బాగోగులు తెలుసుకోవడం, ఏదైనా అవసరం వస్తే.. ముందుండి తానే చూసుకోవడం వంటి చేసేవాడు. దీంతో ఆ కుటుంబం ఆ కామాంధుడ్ని పూర్తిగా నమ్మింది. అప్పుడప్పుడు ఆ చిన్నారిని తన ఇంటికి తీసుకెళ్లేవాడు. ఆ చిన్నారికి ఏ అవసరం ఉన్న అతడే తీర్చేవాడు.. చివరికి అత్యాచారం చేసి కడుపు చేశాడు..ఈ విషయాన్ని ఆ నిందితుడు తన భార్యకు చెప్పాడు.ఆ మహా తల్లి కూడా ఆ కామాంధుడికే సహకరించింది. ఆ చిన్నారికి తెలియకుండా.. గర్బం నిరోధక మాత్రలు వేసింది. అలా ఆ చిన్నారికి అబార్షన్ చేయించింది. ఈ చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.. ప్రస్తుతం బాలికకు చికిత్సను అందిస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
