NTV Telugu Site icon

Dehradun: డెహ్రాడూన్ కారు ప్రమాదంలో వెలుగులోకి దారుణమైన అంశాలు!

Dehradun

Dehradun

యుక్త వయసులో మంచి, చెడులు ఆలోచించే వివేచన ఉంటుంది. జీవితం ముందుకు సాగాలన్నా.. పాడు చేసుకోవాలన్నా.. యవ్వనమే టర్నింగ్ పాయింట్ అవుతోంది. ఏ మాత్రం రాంగ్ స్టెప్ వేసినా జీవితాలను చేజేతులారా నాశనం చేసుకున్న వాళ్లు అవుతారు. ఇదంతా ఎందుకంటారా? ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ కారు ప్రమాదం తర్వాత ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది. అసలేమైంది? డెహ్రాడూన్ కారు ప్రమాదం ఎలా జరిగింది? మృతదేహాలు శిరచ్ఛేదం ఎలా చేయబడ్డాయో తెలియాలంటే ఈ వార్త చదవండి.

సిద్ధేష్ అగర్వాల్ (25) అనే యువకుడు టయోటా ఇన్నోవా కొత్త కారు కొనుగోలు చేశాడు. దీంతో తన స్నేహితులకు పార్టీ ఏర్పాటు చేశాడు. ఏడుగురు స్నేహతులు బాగా మద్యం సేవించారు. పార్టీ పూర్తి చేసుకున్న తర్వాత మంగళవారం (నవంబర్ 12) అర్ధరాత్రి 1:30కి సమయంలో లాంగ్ డ్రైవ్‌కు రెడీ అయ్యారు. విపరీతమైన వేగంతో గాల్లో దూసుకుపోతున్నారు. నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు బాగా మద్యం సేవించి ఉన్నారు. అత్యంత వేగంగా దూసుకెళ్లడంతో నగరంలోని ఓఎన్ జీసీ చౌక్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టారు. అంతే కారు నుజ్జునుజ్జు అయిపోయింది. ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు అక్కడికక్కడే ఛిద్రం అయిపోయారు. కారు పైటాప్ లేచి పోవడంతో మృతదేహాలు శిరచ్ఛేదనం అయ్యాయి. ఆరుగురు తలలు లేకుండా పోయాయి. అంతేకాకుండా శరీరాలు కూడా గుర్తు పట్టలేనంతగా నుజ్జునుజ్జు అయిపోయాయి. సిద్ధేష్ అగర్వాల్ మాత్రం తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులు కునాల్ కుక్రేజా (23), అతుల్ అగర్వాల్ (24), రిషబ్ జైన్ (24), నవ్య గోయెల్ (23), కామాక్షి (20), గునీత్ (19)గా గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కుక్రేజా మినహా అందరూ డెహ్రాడూన్‌కు చెందినవారే.

ఇదిలా ఉంటే ఇంత ఘోరమైన ప్రమాదం జరిగి పిల్లలు చనిపోతే.. ఇప్పటి వరకు తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదన్న వార్తలు వినిపిస్తు్న్నాయి. అంతేకాకుండా పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ట్రక్కు డ్రైవర్‌ది తప్పులేదని తేల్చారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి కేసు కూడా నమోదు చేయలేదని సమాచారం. ఇదిలా ఉంటే యువతీ, యువకులు పార్టీ చేసుకున్న దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.