Prank turns deadly: బెంగళూర్‌లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి తన స్నేహితుడి ఆటపట్టించేందుకు చేసిన పని ప్రాణాన్ని తీసింది. నగరంలోని దేవనహళ్లి గ్రామీణ జిల్లాకు చెందిన యోగేష్‌ని బాధితుడిగా గుర్తించారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. గ్యారేజీలో కార్లను కడిగిన తర్వాత ఆరపెట్టేందుకు ఉపయోగించే ‘హై ప్రెషర్ ఎయిర్ మిషన్’ని యోగేష్ ప్రైవేట్ పార్టు వద్ద పెట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. బాధితుడి కడుపులో తీవ్ర గాయాలయ్యాయి.
Read Also: Bengaluru cafe blast: రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో కీలక నిందితుడి అరెస్ట్..
ఎయిర్ ప్రెషర్ కారణంగా యోగేష్ కడుపులో అంతర్గత గాయాలు అయ్యాయని, పేగులు కూడా తీవ్రం దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. యోగేష్ తండ్రి, సోదరితో కలిసి తనిసంద్రలో నివాసం ఉంటున్నాడు. నిందితుడు మురళిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నివేదిక ప్రకారం.. మురళి, యోగేష్‌తో సరదాగా జోక్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.
మురికిని తొలగించడానికి హై ప్రెషర్ ఎయిర్ మిషన్ ఉపయోగిస్తుండగా, మురళి యోగేష్ ముఖం వైపుగా మిషన్‌ని తీసుకెళ్లాడు. ఆ సమయంలో యోగేష్ నేలపై పడిపోవడంతో దీనిని అదునుగా తీసుకుని మురళి అతని ప్రైవేట్ పార్ట్‌లోకి మిషన్ ద్వారా గాలిని పంపాడు. దీంతో అతడి పేగులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాధితుడిని ఆస్పత్రికి తరలించి, అత్యవసర శస్త్రచికిత్స అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. యోగేష్ తన పల్సర్ బైకుని సర్వీసింగ్ చేయించేందుకు మురళికి చెందిన గ్యారేజ్ ‘‘సీఎన్ఎస్ కార్ స్పా’’కి తీసుకెళ్లాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
