Site icon NTV Telugu

Cyber fraud: మహారాష్ట్ర మాజీ సీఎం పేరుతో రూ.40 లక్షలకు టోకరా

Cyberfraud

Cyberfraud

దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. బాధితులు కూడా పెద్ద ఎత్తులో మోసపోతున్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పేరుతో భారీ సైబర్ మోసం జరిగింది. డ్రగ్స్ , హత్య కేసులో కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామంటూ సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. దీంతో ఓ గృహిణి నుంచి రూ.40 లక్షలు చీటర్స్ కాజేశారు.

ఇది కూడా చదవండి: IND vs SL 1st ODI: రేపటి నుంచే వన్డే సిరీస్ ప్రారంభం.. పంత్-రాహుల్‌లలో వికెట్ కీపర్ ఎవరు?

హైరదాబాద్ నగరానికి చెందిన 40 ఏళ్ల గృహిణికి ఫెడెక్స్ కొరియర్ పేరిట నేరగాళ్లు కాల్ చేశారు. ఆమె ఆధార్ నెంబర్‌తో ఎమ్.డి.ఎమ్.ఏ డ్రగ్స్ పార్శల్ వచ్చిందని తెలిపారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కాల్ ఫార్వార్డ్ చేసినట్లు నమ్మించారు. అనంతరం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫోటో పంపి.. అతనికి ప్రపంచ వ్యాప్తంగా సంబంధాలు ఉన్నాయని భయపెట్టారు. తాము చెప్పిన విధంగా డబ్బు పంపించాలని… లేదంటే కుటుంబ సభ్యుల ఖాతాలను ఫ్రీజ్ చేసి వారిని అరెస్టు చేయిస్తామని బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు రూ. 40 లక్షలు వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేసింది. అనంతరం మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Adhir Chowdhury: అధిర్ రంజన్ బీజేపీలో చేరవచ్చు.. తృణమూల్ సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version