Crime News: కుటుంబ బంధాలు, నమ్మకాలను తాకట్టు పెట్టేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఘటన అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. సొంత మేనత్తతో అల్లుడు వివాహేతర బంధం పెట్టుకున్నాడు. మామ మందలించడంతో అతనిపై కక్ష కట్టి చంపేశాడు. ఈ ఘటనక స్థానికంగా కలకలం రేపింది.
ఆధునిక సమాజంలో సంబంధాల నిర్వచనం మారిపోతోంది. వివాహేతర సంబంధాలు బలమైన బంధాలను తెంచేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అది వక్ర మార్గాలకు దారి తీస్తూ, కుటుంబాలను బద్దలుచేసే శక్తిగా మారుతోంది. ఇటీవల జరుగుతున్న ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని కెరటాంలో ఓ మేనమామ, మేనల్లుడు మధ్య తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. కుటుంబ సంబంధాల మధ్య చెలరేగిన వివాదం హత్యకు దారితీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Wedding Drama: మొదటి భార్య కంప్లెయింట్.. నిత్య పెళ్లి కొడుకు బండారం బట్ట బయలు!
కెరటాంకి చెందిన నిడిగేట్టి కృష్ణను, అతడి మేనల్లుడు నారిపాటి సాయి మద్యం మత్తులో పీక నులిమి హత్య చేశాడు. నిందితుడు సాయి మృతుడు కృష్ణ ఒకే ఇంట్లో ఉండే వారు. కృష్ణ భార్యతో సాయి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన కృష్ణ, సాయిని మందలించడమే కాకుండా సంబంధాన్ని విడిచిపెట్టాలని హెచ్చరించాడు. రాత్రి ఇద్దరూ మద్యం సేవిస్తూ గొడవకు దిగారు. మద్యం మత్తులో ఉన్న సాయి, కృష్ణపై తెగబడ్డాడు. పీక నులిమి ఊపిరి ఆడకుండా చేశాడు. దీంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు విషయం బయటపడకూడదని సహజ మరణంగా చెప్పి, మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
Yezdi Roadster 2025: 6-స్పీడ్ గేర్‌బాక్స్, 334cc సింగిల్-సిలిండర్‌తో కొత్త యెజ్డి రోడ్‌స్టర్ విడుదల!
అంతా అయిపోయిందనుకున్నారు. కానీ గ్రామ పెద్దలకు సాయి తీరుపై అనుమానం వచ్చింది. సాయిని పిలిపించి నిలదీశారు. అంతే సాయి.. తరువాత నుంచి గ్రామంలో కనిపించ లేదు. అనుమానం నిజమని భావించిన గ్రామ పెద్దలే .. 100 నెంబరుకు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఫోన్ కాల్ ఆధారంగా సంఘటన స్థలానికి చేరుకున్న బొండపల్లి పోలీసులు, తహశీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కృష్ణ భార్యపైనా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతా తెలిసి చెప్పకుండా ఇలా పూడ్చిపెట్టారని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో జరుగుతున్న ఇలాంటి ఘటనలు అందర్నీ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కుటుంబాల్లో బంధాలపై అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
