UP Crime: “నన్ను ప్రేమించి వేరేవాడితో అక్రమ సంబంధం”.. ప్రియురాలి తలనరికి దారుణ హత్య..
- మోసం చేసిందని యువతి తలనరికి చంపిన ప్రియుడు..
- ఉత్తర్ ప్రదేశ్‌లో ఘటన..
- అధికారులకు నిందితుడి వార్నింగ్..
- వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Crime: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్‌లో చిల్లింగ్ మర్డర్ జరిగింది. ప్రేమించిన యువతిని అత్యంత దారుణంగా తలనరికి హత్య చేశాడు. ఈ విషయాన్ని చాలా గొప్పగా వీడియోలో చెప్పాడు. ఆమె వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే హత్య చేశానని వీడియోలో ఒప్పుకున్నాడు. తన 2.5 ఏళ్ల సంపాదన ఆమె నాశనం చేసిందని, ఆమె హత్యకు అర్హులాని పేర్కొన్నాడు. బులంద్ షహర్‌లోని ఖుర్జానగర్ కొత్వాలి ప్రాంతంలో మొహల్లా ఖిర్ఖానీలోని శ్మశానవాటికలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: Deputy C M: రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం పదవి ఉందా? గతంలో సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్‌ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
తాను చేసిన హత్యకు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా నవ్వుతూ హత్య విషయాన్ని గొప్పగా చెప్పుకుంటూ తీసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తనకు ద్రోహం చేస్తే స్నేహితులను కూడా చంపేస్తానని నిందితులు చెప్పాడు. తాను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కి వీరాభిమానినని, ‘‘ఖల్ నాయక్’’ సినిమాలో దత్ పోషించిన ‘బల్లూ బలరామ్’ క్యారెక్టర్ తనకు ఇష్టమని నిందితుడు చెప్పాడు. ప్రేమలో ద్రోహాన్ని చేస్తే వారికి మరణమే శిక్ష అంటూ వ్యాఖ్యానించాడు. మృతురాలి గొంతు కోశానని నవ్వతూ చెప్పాడు.
నిందితుడి అసలు పేరు అద్నాన్‌గా స్థానికులు చెబుతున్నారు. నా కుటుంబాన్ని తాకే ధైర్యం చేయొద్దని అధికారులను హెచ్చరించడం వీడియోలో చూడొచ్చు. నా కుటుంబ సభ్యుల్ని తాకిని వారి ఇళ్లపై బాంబులు వేస్తానని చెప్పాడు. తాను ఒకే హత్య చేయడం వల్ల ఎన్‌కౌంటర్‌కి గురికానని, ఎవరైనా 10 లేదా అంతకంటే ఎక్కువ మందిని చంపినప్పుడు మాత్రమే ఎన్‌కౌంటర్ జరుగుతుందని, అన్ని హత్యలు చేస్తే నేను ఎన్‌కౌంటర్‌కి సిద్ధంగా ఉంటానని చెప్పారు. మరణించిన బాధితురాలని అస్మాగా పోలీసులు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. నిందితుడిని అరెస్ట్ చేసి, తదుపరి విచారణ చేస్తున్నారు.
गर्लफ्रेंड की हत्या करने वाले अदनान उर्फ बल्लू को सुनिए…"मोहब्बत में धोखा देने वालों की सिर्फ एक ही सजा है मौत, चाकू से गर्दन काट डाली"
📍 बुलंदशहर, उत्तर प्रदेश https://t.co/KEZ4adMLgv pic.twitter.com/0njxzOHcst— Sachin Gupta (@SachinGuptaUP) June 12, 2024
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
-
Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్‌బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!