Site icon NTV Telugu

Online Betting : ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌పై సిట్- సీఐడీ సంచలన ఆపరేషన్

Betting

Betting

Online Betting : దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్‌ను అణిచివేయడంలో భాగంగా సిట్–సీఐడీ భారీ స్థాయి ఆపరేషన్‌ చేపట్టింది. రాజస్థాన్‌, గుజరాత్‌, పంజాబ్ రాష్ట్రాల్లో ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపి ఎనిమిది మంది ఆపరేటర్లను అరెస్ట్ చేసింది. దర్యాప్తులో భాగంగా Taj0077, Fairplay.live, Andhra365, Vlbook, Telugu365, Yes365 అనే ఆరు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై విచారణ కొనసాగుతోంది. ఈ యాప్‌ల ద్వారా అంతర్రాష్ట్ర స్థాయిలో భారీగా బెట్టింగ్ బిజినెస్ నడుస్తోందని అధికారులు గుర్తించారు.

Abhishek Sharma: అభిషేక్ శర్మ చరిత్ర.. అప్పుడే విరాట్ కోహ్లీ క్లబ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ!

సోదాల్లో పలు హార్డ్‌వేర్ పరికరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, కొన్ని బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్లు సీఐడీ అధికారులు వెల్లడించారు. ప్రధాన సూత్రధారులు విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు బయటపడగా, మిగిలిన నిందితుల కోసం సిట్ ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌తో దేశవ్యాప్తంగా నడుస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యాపారంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

High Court: “ఇది అమెరికా కాదు.. భారత్”.. హైకోర్టులో ఎక్స్‌(ట్వీటర్)కు భారీ ఎదురుదెబ్బ..!

Exit mobile version