NTV Telugu Site icon

Delhi: ట్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు.. నిందితుడి మొబైల్‌లో ఏమున్నాయంటే..!

Delhimurder

Delhimurder

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం రోజే.. కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన చెల్లెలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.

దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలోని డియోలీలో ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు బుధవారం (నవంబర్ 4) ఉదయం హత్యకు గురయ్యారు. మృతులు భర్త రాజేష్ (55), భార్య కోమల్ (47), కూతురు కవిత (23)గా పోలీసులు గుర్తించారు. ఉదయం మార్నింగ్ వాకింగ్ వెళ్లొచ్చేటప్పటికీ చనిపోయి ఉన్నారని కుమారుడు రాజేష్ పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా అజ్ఞాత వ్యక్తులు వచ్చినట్లు కనబడలేదు. దీంతో రాజేష్‌పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లుగా ఒప్పుకున్నాడు.

ఇది కూడా చదవండి: Lip Care Tips: చలికాలంలో పెదవులు పగులుతున్నాయా..? మృదువైన పెదాల కోసం ఇలా చేయండి

నిందితుడు రాజేష్‌ను కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబ సభ్యుల్ని హత్య చేసేందుకు మొబైల్‌లో వెబ్‌ స్టోరీలు చూసినట్లుగా కనుగొన్నారు. అంతేకాకుండా ఏ విధంగా హత్య చేయాలో అన్నదానిపై అనేక కోణాలను అన్వేషించినట్లుగా గుర్తించారు. విష ప్రయోగం ద్వారా కూడా చంపేందుకు సర్చ్ చేశాడు. కానీ ఇవన్నీ కుదరకపోవడంతో తండ్రికి సంబంధించిన ఆర్మీ కత్తిని తీసుకుని ముగ్గురిని చంపేశాడు. మొదటిగా సోదరిపై దాడి చేశాడు. చెయ్యి అడ్డుపెడితే విరిగిపోయింది. దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసినా.. దాడి చేస్తూనే ఉన్నాడు. ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం అంతస్తు పైకి వెళ్లి తండ్రిపై దాడి చేశాడు.. అనంతరం తల్లిపై దాడి చేసి ముగ్గురి ప్రాణాలు తీశాడు.

ఇదిలా ఉంటే కుటుంబ సభ్యులతో రాజేష్‌కు ఎలాంటి విభేదాలు లేవని బంధువులు తెలిపారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని.. అందరూ బాగానే ఉంటారని చెప్పుకొచ్చారు. కుమారుడికి హై-ఎండ్ మోటార్ సైకిల్ కొనిచ్చాడని బంధువు తెలిపారు. అంతేకాకుండా జిమ్‌కు అవసరమైన వస్తువులతో పాటు మంచి ఆహారం కూడా తండ్రి అందిస్తున్నాడని వెల్లడించారు. అయితే సోదరిని మాత్రం చంపేస్తానంటూ పలుమార్లు బెదిరించేవాడని స్థానికులు తెలిపారు. సరాదాగా అంటున్నాడేమో అనుకున్నామని చెప్పారు.

ఇది కూడా చదవండి: Basil Joesph : డైరెక్షన్ వద్దు.. యాక్టింగే ముద్దు