NTV Telugu Site icon

Chhattisgarh: ఐఏఎస్ కావాలని కలలు కని.. చివరికి పోలీసులకు ఇలా చిక్కాడు..!

Chori

Chori

ప్రతి విద్యార్థి తన భవిష్యత్‌కు మంచి పునాది వేసుకోవాలని కోరుకుంటారు. అందుకోసం ఎంతగానో శ్రమపడుతుంటారు.. కష్టపడతారు. సమయాన్ని ఎంతగానో సద్వినియోగం చేసుకుంటారు. ఇక లక్ష్యం చేరేదాకా వెనకడుగు వేయరు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో ఒక కుర్రాడు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించి కటకటాల పాలయ్యాడు. ఐఏఎస్ కావాలని కలలు కని.. చివరికి క్రైమ్ చేసి ఖాకీలకు అడ్డంగా బుక్ అయ్యాడు.

ఇది కూడా చదవండి: Ghaziabad: రోడ్డుపై నగ్నంగా తిరిగిన మహిళ.. పోలీసుల గాలింపు

వినయ్ కుమార్ సాహు(28).. సివిల్ సర్వెంట్ కావాలని ఆకాంక్షించాడు. ఇందుకోసం ఆరేళ్ల క్రితం ఢిల్లీ వెళ్లి కోచింగ్ కూడా తీసుకున్నాడు. 2017-2018లో ఢిల్లీలో ఉన్నాడు. కానీ కఠినమైన ఆలిండియా టెస్ట్‌లో విఫలమయ్యాడు. అనంతరం తట్టాబుట్టా సర్దుకుని ఛత్తీస్‌గఢ్‌లోని అహివారా పట్టణంలోని తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. అప్పుడే అతడి బుద్ధి.. క్రైమ్ వైపు మళ్లింది. క్రైమ్ వైపు అరంగ్రేటం చేసి మొదట మొబైల్ స్నాచింగ్ వంటి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ క్రైమ్ కొనసాగిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: NEET Paper leak case: పేపర్ లీక్ కేసులో సీబీఐ తొలి అరెస్ట్.. బీహార్‌లో ఇద్దరు అరెస్ట్

అయితే తాజాగా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్న ఆలోచన కలిగింది. అంతే ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఓ జంట సన్నిహితంగా ఉండడాన్ని గమనించాడు. దీంతో అతడు మొబైల్‌లో ఆ దృశ్యాలు రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్ మొదలు పెట్టాడు. తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని.. లేదంటే ఆన్‌లైన్‌లో పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడు. సోషల్ మీడియాలోకి వెళ్తే పరువుపోతుందని జంట తొలుత భావించింది. కానీ చివరికి జంట సాహసం చేసి పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితుడ్ని చాకచక్యంగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అతడి క్రైమ్ బయటకు వచ్చింది. చేసిన ఇళ్లల్లోనే దొంగతనం చేసేవాడని.. అతడు సివిల్స్ విఫలమయ్యాడు.. దొంగతనంలో విఫలమయ్యాడని.. సోమరి దొంగ అని సీనియర్ పోలీసు అధికారి హేమ్ ప్రకాష్ నాయక్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: TPCC Post: తెలంగాణకు కొత్త పీసీసీ నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు..