ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాతగా పేరున్న మనోజ్ రాజ్‌పుత్‌పై అత్యాచార అభియోగాలు నమోదయ్యాయి. తనను పెళ్లి చేసుకుంటానని 13 ఏళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. 29 ఏళ్ల బాధితురాలు మనోజ్ రాజ్‌పుత్‌కి బంధువు. శుక్రవారం దుర్గ్ జిల్లాలోని అతని కార్యాలయం నుంచి అదుపులోకి తీసుకున్నారు.
పెళ్లి సాకుతో 2011 నుంచి రాజ్‌పుత్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత మహిళ ఓల్డ్ భిలాయ్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరి 22న ఫిర్యాదు చేసింది. మనోజ్ పెళ్లిని దాటివేస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింందని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ రాజ్ కుమార్ బోర్జా తెలిపారు. అత్యాచారం, అసహజ సెక్స్, క్రిమినల్ బెదిరింపు మరియు ఇతర నేరాలకు సంబంధించి ఐపీసీ సెక్షన్ల కింద రాజ్‌పుత్‌పై అభియోగాలు మోపారు. బాధితురాలిపై లైంగిక దాడి ప్రారంభమైనప్పుడు మైనర్ కావడంతో పోక్సో చట్టాన్ని కూడా నిందితుడిపై నమోదు చేశారు. అయితే, రాజ్‌పుత్ నేరానికి పాల్పడిన 2011లో పోక్సో చట్టం లేదని, స్థానిక కోర్టు పోక్స్ నిబంధనలను రద్దు చేసింది.