Site icon NTV Telugu

Drug Case : చర్లపల్లి డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

Drugs

Drugs

Drug Case : హైదరాబాద్‌లో మరోసారి భారీ స్థాయి డ్రగ్స్‌ రాకెట్ వెలుగులోకి వచ్చింది. చర్లపల్లి డ్రగ్స్‌ కేసులో ముంబయి క్రైమ్ బ్రాంచ్, తెలంగాణ నార్కో బ్యూరో సంయుక్త దర్యాప్తుతో కీలక అంశాలు బయటపడ్డాయి. దర్యాప్తు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, విజయ్‌ ఓలేటి అనే వ్యక్తి చర్లపల్లి, నాచారం ప్రాంతాల్లో మెపీడ్రిన్‌ (Mephedrone) తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి, డ్రగ్స్‌ను విస్తృతంగా విక్రయిస్తున్నాడు. ప్రతి సారి ఐదు కిలోల చొప్పున డ్రగ్స్‌ను తయారు చేసి, ఒక్కో కిలోను సుమారు రూ.50 లక్షల ధరకు విక్రయించినట్లు సమాచారం. ఈ లావాదేవీల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు.

Bandla Ganesh: మౌళి… కొడితే నీలా కొట్టాలి రా బాబు దెబ్బ… చంపేశావ్!

డ్రగ్స్ వ్యాపారం కోసం విజయ్ ప్రత్యేకంగా ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ నెట్‌వర్క్‌ను విస్తరించి, వినియోగదారులకు సరఫరా చేశాడు. ప్రతి సారి 5 కిలోల వరకు సరఫరా చేస్తూ, డ్రగ్ మాఫియాలో కీలక వ్యక్తిగా ఎదిగాడు. విజయ్ గ్యాంగ్‌పై ముంబయి క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే పూర్తి ఆధారాలను సేకరించింది. ఈ రాకెట్ గత 10 ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ, ఎనిమిది నెలల క్రితం మాత్రమే తెలంగాణ నార్కో బ్యూరో దృష్టికి వచ్చింది.

వెంటనే విచారణ ప్రారంభించి, నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ తయారీ, విక్రయాలపై నార్కో బ్యూరో నోటీసులు జారీ చేయడంతో విజయ్ కోర్టును ఆశ్రయించాడు. అయితే, అతని డ్రగ్స్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు మరింత ముమ్మరమైంది. ఈ కేసుతో తెలంగాణలో మాదక ద్రవ్యాల మాఫియాపై మరింత కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Raghava Lawrence : లారెన్స్.. నువ్వు బంగారం.. దివ్యాంగురాలికి ఏం చేశాడంటే..

Exit mobile version